ETV Bharat / bharat

నేపాల్​లో హోటల్​.. యూపీలో గెస్ట్ హౌస్​.. 200కు పైగా చోరీలు చేసిన కోటీశ్వరుడు అరెస్ట్​ - దొంగతనాలు చేసిన కోటీశ్వరుడు అరెస్ట్​

Millionaire Thief Arrested : 200కు పైగా దొంగతనాలు చేసిన ఓ 'మిలియనీర్'​ దొంగను పట్టుకున్నారు దిల్లీ పోలీసులు. ఈ దొంగ సొమ్ముతో ఓ హోటల్​తో పాటు అనేక కోట్లు విలువైన ఆస్తులను కొనుగోలు చేశాడని గుర్తించారు. కనీసం భార్యకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్తపడిన ఈ వ్యక్తి కథేంటో తెలుసుకోండి..

Millionaire Thief Arrested
కోటీశ్వరుడైన దొంగ అరెస్ట్
author img

By

Published : Aug 16, 2023, 4:10 PM IST

Millionaire Thief Arrested : ఆయనో హోటల్​కు యజమాని. అనేక కోట్లు విలువైన ఆస్తులు ఆయన సొంతం. ఇవే కాకుండా ఈ ఆస్తుల ద్వారా నెలకు దాదాపు రూ.2లక్షలు అద్దెలు కూడా వస్తాయి. ఇవన్నీ చూస్తే ఎంతో ఆయనో ఉన్నతమైన వ్యక్తి అన్న భావన అందరిలోను కలుగుతోంది. ఆయన కుటుంబ సభ్యులు సైతం అదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆయన ఇవన్నీ ఎలా సంపాదించాడో తెలిసి అందరూ షాక్​కు గురయ్యారు. ఓ పక్క నిజాయితీగా కనిపిస్తున్న ఈయన.. ఇప్పటివరకు దాదాపు 200కు పైగా దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ విషయం కనీసం భార్యకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.

ఉత్తర్​ప్రదేశ్​లోని సిద్ధార్థ్ నగర్​ జిల్లాకు చెందిన మనోజ్​ చౌబే కుటుంబం.. నేపాల్​లో స్థిరపడింది. అతడు 1997లో దిల్లీకి వలస వచ్చాడు. అక్కడే కీర్తినగర్​లో ఓ క్యాంటీన్​ను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అనేక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి.. జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత పెద్ద ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అధిక మొత్తంలో దొంగతనం చేశాడు. దోచుకున్న సొమ్ముతో స్వగ్రామానికి వెళ్లి అక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు. ఈ సొమ్ముతో నేపాల్​లో ఓ హోటల్​ను నిర్మించాడు. ఆ తర్వాత యూపీ నీటిపారుదల శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తాను దిల్లీలో ఓ పార్కింగ్​ కాంట్రాక్ట్​ తీసుకున్నానని.. అక్కడే ఉండాల్సి వస్తుందని భార్య సహా వారి కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఇలా ఏడాదిలో 8 నెలలు దిల్లీలోనే ఉండేవాడు. ఈ దొంగ సొమ్ముతో శోహరత్​గఢ్​ పట్టణంలో భార్య పేర ఓ గెస్ట్ హౌస్, లఖ్​నవూలో మరో ఇల్లు​ కట్టాడు. అనేక స్థిరాస్తులు కొనుగోలు చేసి లీజ్​కు ఇచ్చాడు. ఈ ఆస్తులతో దాదాపు అతడికి రూ.2లక్షలు అద్దె రూపంలో వస్తాయి. ఆ తర్వాత దిల్లీకి మకాం మార్చిన మనోజ్​.. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు.

Millionaire Thief Arrested
మనోజ్ చౌబే

అయితే, ఇక్కడ వరకు ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడ్డ మనోజ్​పై​.. పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై అతడి కుటుంబాన్ని విచారించగా.. వారు అంగీకరించలేదు. వెంటనే మనోజ్​ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తే అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పటివరకు తాను 200కు పైగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. సుమారు 15కు పైగా కేసులు తనపై నమోదుకాగా.. 9 సార్లు అరెస్ట్ అయినట్లు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుంచి రూ. లక్ష విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగతనం చేసిన వెంటనే మనోజ్​.. ఆ వస్తువుల రూపం మార్చి విక్రయించేవాడని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

DIG ఫోన్​నే చోరీ చేసిన దొంగ.. పడవలో వచ్చి పక్క ఊరి ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లిన గ్రామస్థులు..

SI గన్​ లాక్కుని చెట్టెక్కిన దొంగ.. పోలీసులు అనేక గంటలు బతిమలాడితే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.