జమ్ముకశ్మీర్లో భాజపా నాయకుడు అన్వర్ ఖాన్ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. శ్రీనగర్ శివారు ప్రాంతమైన అరిభాగ్లో ఈ ఘటన జరిగింది. దాడిలో అన్వర్ ఖాన్ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఓ కానిస్టేబుల్ మృతి చెందారని వెల్లడించారు.
"ఉదయం సుమారు 11.30గంటలకు దాడి జరిగింది. ఈ కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ రమ్జీత్ రాజా మృతిచెందారు."
-పోలీసు ఉన్నతాధికారి
దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దాడిని భాజపా తీవ్రంగా ఖండించింది.
ఇదీ చదవండి: చిత్రహింసలు పెట్టి వితంతువుపై హత్యాచారం!