ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- కీలక ఉగ్రనేత హతం - one militant die in JK encounter

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రముఠా కమాండర్​ హతమయ్యాడు. బారాముల్లా జిల్లాలో.. నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ పరిణామాలు ఎన్​కౌంటర్​కు దారితీశాయి.

Militant gunned down in encounter with security forces in J-K's Baramulla
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం
author img

By

Published : Mar 9, 2021, 8:13 PM IST

Updated : Mar 9, 2021, 10:34 PM IST

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రత బలగాల మధ్య ఎన్​కౌంటర్​లో అల్​ బదర్​​ ఉగ్రవాద సంస్థ కమాండర్​ హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలోని తుజ్జర్ ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతో అధికారులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.​ ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిపారు భద్రతా సిబ్బంది.

ఇదీ చూడండి: బ్రిటన్​ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు

Last Updated : Mar 9, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.