ఎమ్ఎమ్సీ(మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులకు, వారి ఉద్యమానికి.. మిలింద్ తేల్‌తుంబ్డే(milind teltumbde news ) మృతితో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని గడ్చిరోలీ డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. రాష్ట్రంలో 20ఏళ్ల పాటు మావోయిస్టుల ఉద్యమంలో కీలకంగా ఆయన వ్యవహరించాడని పేర్కొన్నారు(gadchiroli naxal encounter news).
గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని గ్యారపట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పుల్లో(gadchiroli encounter) కనీసం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత మిలింద్ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కోరేగావ్ భీమా-మావోయిస్టుల సంబంధాల కేసులో బలగాలు వెతుకుతున్న నిందితుల్లో తేల్‌తుంబ్డే ఒకరని తెలిపారు.
"మహారాష్ట్రలో మావోయిస్టుల ఉద్యమం భవిష్యత్తు అంతా మిలింద్ తేల్తుంబ్డేపైనే ఆధారపడింది. రాష్ట్రంలో వేరే నేతలు ఎవరూ లేరు. విదర్భా ప్రాంతంలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉండేది. 20ఏళ్లల్లో అత్యంత కీలకమైన క్యాడర్‌గా ఎదిగాడు. మిలింద్ కోసం మేము చాలా కాలం నుంచి గాలిస్తున్నాము. ఇప్పుడు ఆయన మరణంతో ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది."
--- సందీప్ పాటిల్, గడ్చిరోలి డీఐజీ
రకరకాల పేర్లతో...
ఉద్యమానికి సంబంధించి అటు అడవుల్లోను, ఇటు నగరాల్లోనూ మిలింద్కు మంచి పట్టు ఉందని సందీప్ పాటిల్ వెల్లడించారు. 'అర్బన్ నక్సల్స్' ఉద్యమంలో మిలింద్కు రెబల్స్‌తో కూడిన అర్బన్ నెట్వర్క్ ఎక్కువగా ఉందని వివరించారు. విదర్భ ప్రాంతంలోని ఓ వర్గానికి చెందిన యువతను మావోయిస్టుల ఉద్యమంలో చేరే విధంగా వారిని మిలింద్ ప్రభావితం చేశాడని పేర్కొన్నారు. 'కామ్రేడ్ ఎమ్', 'అనిల్', 'దీపక్', 'సహయాద్రి' వంటి పేర్లతో మిలింద్ సంచరించేవాడని వివరించారు.
ఇదీ చూడండి:- గడ్చిరోలి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భీతావహ దృశ్యాలు