ETV Bharat / bharat

షాకింగ్.. కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్​ - Ministry of Information twitter hack

MIB twitter: కేంద్ర సమాచార, ప్రసార శాఖ ట్విట్టర్​ ఖాతా హ్యాక్​ అయింది. దీంతో కొన్ని నిమిషాల పాటు నిలిచిపోయింది. అనంతరం ఖాతాను తిరిగి పునరుద్ధరించినట్లు అధికారులు చెప్పారు.

MIB twitter
షాకింగ్.. కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్​
author img

By

Published : Jan 12, 2022, 10:38 AM IST

Updated : Jan 12, 2022, 12:09 PM IST

MIB twitter: భారత్​లో ట్విట్టర్ ఖాతాలు తరచూ హ్యాకింగ్​కు గురవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. బుధవారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారిక ట్విట్టర్​ ఖాతా కొద్ది నిమిషాల పాటు హ్యాక్​కు గురైంది. అయితే వెంటనే ఖాతాను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.

హ్యాకర్లు కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్​ ఖాతాను హ్యాక్ చేసిన అనంతరం వరుసుగా 50కిపైగా ట్వీట్లు చేశారు. హరీ అప్​(Hurry Up) , అమేజింగ్​ (Amazing) అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ ఫొటోతో హైపర్​లింక్​లు పెట్టారు. ఈ ట్వీట్లు గందరగోళానికి గురి చేశాయి. వెంటనే అధికారులు ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు.

Twitter account of the Ministry of Information and Broadcasting was briefly comprised
కేంద్ర సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్​

సరిగ్గా నెల రోజుల క్రితం డిసెంబర్​ 12న కూడా ప్రదాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్​కు గురికావడం గమనార్హం. హ్యాకర్లు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు పెట్టారు. లోపాలను సవరించి కాసేపటికే ప్రధాని ఖాతాను అధికారులు పునరుద్ధరించారు.

ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 1.95 లక్షల మందికి వైరస్​

Last Updated : Jan 12, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.