ETV Bharat / bharat

సిక్కుల పాక్​ పర్యటనకు అనుమతి నిరాకరణ - siromani gurudwara prabandhak committee

సిక్కుల పాకిస్థాన్​ పర్యటనకు కేంద్ర హోం శాఖ అనుమతి నిరాకరించింది. కొవిడ్, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

home ministry, gurudwara
సిక్కు యాత్రికుల ప్రయాణానికి అనుమతించని కేంద్రం
author img

By

Published : Feb 18, 2021, 9:49 AM IST

పాకిస్థాన్​లోని గురుద్వారాలను సందర్శించేందుకు సిద్ధమైన 600మంది సిక్కు యాత్రికులకు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకు స్పష్టం చేసింది. కొవిడ్, భద్రతా సమస్యల కారణంగా అనుమతి నిరాకరించినట్టు పేర్కొంది.

కొవిడ్​ కారణంగా గతేడాది మార్చి నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు, వ్యాపారాలు తగ్గాయని కేంద్రం వెల్లడించింది. పాక్​లో వైద్యానికి ఉన్న మౌలిక వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. వీటితో పాటు దాయాది దేశంలో పర్యటకులకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయపడింది.

యాత్రికులు శుక్రవారం పాక్​కు బయలుదేరాల్సి ఉండగా.. బుధవారం ఈ ప్రకటన చేసింది హోంశాఖ.

ఇదీ చదవండి : నేడు దేశవ్యాప్తంగా రైతుల 'రైల్​రోకో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.