ETV Bharat / bharat

క్యాబ్​లో వెళ్తున్న మహిళకు వేధింపులు.. 10నెలల చిన్నారిని బయటకు తోసేసి హత్య.. ఆపై.. - మహిళను వేధించిన డ్రైవర్​

పది నెలల చిన్నారిని కారులో నుంచి బయటకు తోసేశారు. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. చిన్నారి తల్లిని వేధించిన నిందితులు.. ఆమె ప్రతిఘటించడం వల్ల ఆమెను సైతం కారు నుంచి తోసేశారు. ఈ ఘటన మహారాష్ట్ర పాల్ఘర్​లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

maharashtra cab harassment
maharashtra cab harassment
author img

By

Published : Dec 11, 2022, 12:49 PM IST

Updated : Dec 11, 2022, 6:21 PM IST

మహారాష్ట్ర పాల్ఘర్​లో దారుణం జరిగింది. పది నెలల చిన్నారిని కారులో నుంచి బయటకు తోసేశారు దుండగులు. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. చిన్నారి తల్లిని వేధించిన నిందితులు.. ఆమె ప్రతిఘటించడం వల్ల మహిళను సైతం కారు నుంచి తోసేశారు. ఈ ఘటన మండ్వీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ముంబయి-అహ్మదాబాద్​ జాతీయ రహదారిపై జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ జరిగింది
ఓ మహిళ.. తన 10 నెలల కూతురితో కలిసి పెల్హర్​ నుంచి పోషీర్​కు క్యాబ్​లో ప్రయాణిస్తోంది. ఆమెతో పాటు మరికొందరు ప్రయాణికులు సైతం అందులో ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత దూరం వెళ్లాక కారు డ్రైవర్​ సహా ప్రయాణికులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీనికి ఆ మహిళ ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన నిందితులు.. వేగంగా ప్రయాణిస్తున్న కారులో నుంచి చిన్నారిని బయటకు తోసేశారు. ఈ ప్రమాదంలో చిన్నారి ఘటనా స్థలంలోనే మరణించింది. అనంతరం మహిళను సైతం కారులో నుంచి బయటకు తోసేయగా.. తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి: ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించిన భర్త

వేరే మహిళతో తండ్రిని అలా చూశాడని కొడుకు దారుణ హత్య.. చేతులు నరికేసి.. ఉరేసి..

Last Updated : Dec 11, 2022, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.