భారత్‌లో మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఇంజినీర్ శ్రీధరన్ త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఆయన తమ పార్టీలో చేరుతున్నట్లు కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది. కేరళలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమమయంలో శ్రీధరన్ భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేరళలో ఈ ఆదివారం భాజపా నిర్వహించనున్న విజయ్ యాత్రలో భాగంగా శ్రీధరన్ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. 88ఏళ్ల వయసున్న ఈ మెట్రోమ్యాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భాజపాలో చేరే విషయంపై శ్రీధరన్ ఇటీవలే పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమేనని వెల్లడించారు.
దేశంలో పలు మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన అనుభవం శ్రీధరన్‌కు ఉంది.
ఇదీ చదవండి:బాంబు దాడి : బంగాల్ మంత్రికి మమత పరామర్శ