ETV Bharat / bharat

ఆ నమూనాలు శ్రద్ధావే.. డీఎన్​ఏ నివేదికలో వెల్లడి - అఫ్తాబ్ పూనావాలా కేసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో దిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. విచారణలో భాగంగా సేకరించిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధావేనని డీఎన్​ఏ పరీక్షలో వెల్లడైంది. సేకరించిన వెంట్రుకలు, ఎముకలు శ్రద్ధా తండ్రి నమూనాలతో సరిపోలినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

Mehrauli killing case
Mehrauli killing case
author img

By

Published : Jan 4, 2023, 6:50 PM IST

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో కీలక విషయం వెల్లడైంది. విచారణలో భాగంగా సేకరించిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధవేనని.. డీఎన్​ఏ పరీక్ష ద్వారా స్పష్టమైంది. మెహ్రౌలీలోని అటవీ ప్రాంతంలో గుర్తించిన వెంట్రుకలు, ఎముకలు.. శ్రద్ధా తండ్రి, సోదరుడి నమూనాలతో సరిపోయాయని స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా వెల్లడించారు. ఈ నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ అండ్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్ సెంటర్‌లో మైటోకాండ్రియల్ ఎగ్జామినేషన్ ద్వారా పరీక్షించినట్లు ప్రత్యేక పోలీసు కమిషనర్ తెలిపారు. డీఎన్​ఏ నివేదిక వచ్చేవరకు పోలీసులు పోస్ట్‌మార్టంను వాయిదా వేశారు. ఇప్పుడు డీఎన్​ఏ రిపోర్ట్‌ దిల్లీ పోలీసులకు అందినందున శవపరీక్షకు మార్గం సుగుమమైంది. ఎయిమ్స్‌కు ఎముకలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపిస్తామని ప్రత్యేక సీపీ తెలిపారు.

శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అఫ్తాబ్ పూనావాలాకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే వాయిస్‌ శాంప్లింగ్ పరీక్ష నిర్వహించారు. నిందితుడు అఫ్తాబ్.. శ్రద్ధాతో గొడవపడుతోన్న ఓ ఆడియో క్లిప్ దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాయిస్‌ను.. అఫ్తాబ్‌ వాయిస్‌తో పోలీసులు సరిపోల్చాలని భావించారు. దిల్లీ కోర్టు ఆదేశాల మేరకు వాయిస్ శాంప్లింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: శ్రద్ధ హత్య కేసులో కీలక ఆధారం.. చేతిలో బ్యాగ్​తో అఫ్తాబ్​ సీసీటీవీ ఫుటేజ్​!

శ్రద్ధ మర్డర్ కేసు.. 12 బాడీ పార్ట్స్ స్వాధీనం.. జైలులో ప్రశాంతంగా నిందితుడి నిద్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.