భద్రత కారణాల పేరుతో తనను మరోమారు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ. పక్షం రోజుల్లోనే మూడోసారి తనను నిర్బంధించారని.. ప్రస్తుతం జరుగుతోన్న డీడీసీ ఎన్నికల ప్రచారానికి భాజపా మంత్రులను అనుమతించి తనపై ఆంక్షలు విధించటమేంటని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
-
Illegally detained today for the third time in less than a fortnight. Too much democracy indeed. If my movements are curbed due to ‘security concerns’ then why are BJP ministers allowed to campaign freely in Kashmir while Ive been asked to wait until culmination of DDC elections? pic.twitter.com/H3v0ixISrL
— Mehbooba Mufti (@MehboobaMufti) December 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Illegally detained today for the third time in less than a fortnight. Too much democracy indeed. If my movements are curbed due to ‘security concerns’ then why are BJP ministers allowed to campaign freely in Kashmir while Ive been asked to wait until culmination of DDC elections? pic.twitter.com/H3v0ixISrL
— Mehbooba Mufti (@MehboobaMufti) December 9, 2020Illegally detained today for the third time in less than a fortnight. Too much democracy indeed. If my movements are curbed due to ‘security concerns’ then why are BJP ministers allowed to campaign freely in Kashmir while Ive been asked to wait until culmination of DDC elections? pic.twitter.com/H3v0ixISrL
— Mehbooba Mufti (@MehboobaMufti) December 9, 2020
" 15 రోజుల్లోనే మూడోసారి ఇవాళ అక్రమంగా నిర్బంధించారు. ఇది చాలా ఘోరమైన ప్రజాస్వామ్య పరిస్థితి. భద్రతాపరమైన ఆందోళనలతో నా ప్రయాణాలను అడ్డుకున్నప్పుడు.. కశ్మీర్లో భాజపా మంత్రులు స్వేచ్ఛగా ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఎలా ఇచ్చారు? "
- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.
బుద్గాం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లే ముందు శ్రీనగర్ గుప్కర్ రోడ్డులోని తన నివాసంలో గృహ నిర్బంధం చేశారని మంగళవారం ఆరోపించారు ముఫ్తీ. తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా కశ్మీర్ అధికార యంత్రాంగంపై విమర్శలు చేశారు.
ఇదీ చూడండి: మళ్లీ గృహ నిర్బంధంలోకి ముఫ్తీ