ETV Bharat / bharat

మేఘాలయ సీఎంగా మళ్లీ ఆయనే.. ప్రమాణ స్వీకారానికి మోదీ హాజరు! - కాన్రాడ్ సంగ్మా నరేంద్ర మోదీ

మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కాన్రాడ్ సంగ్మా సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్​ ఫాగు చౌహాన్​కు అందించారు. మరోవైపు.. మార్చి 7న కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని తెలిపాయి.

meghalaya election result
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా
author img

By

Published : Mar 3, 2023, 4:04 PM IST

మేఘాలయ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) 26 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కాన్రాడ్ సంగ్మా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కాన్రాడ్ సంగ్మా. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్​కు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్​ను సంగ్మా కోరారు. సంగ్మా రాజీనామాను ఫాగు చౌహాన్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సంగ్మాను కోరారు గవర్నర్ ఫాగు చౌహాన్​.

'ఎన్​పీపీకి మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. 32 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్​పీపీకి మద్దతు ఇస్తున్నారు. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే బీజేపీ మద్దతు తెలిపింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి సంగ్మా ధన్యవాదాలు' అని కాన్రాడ్ సంగ్మా విలేకర్లతో మాట్లాడారు.

meghalaya election result
గవర్నర్​ను కలిసిన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా

సంగ్మాకు అభినందనలు: ప్రధాని మోదీ
మేఘాలయ ఎన్నికల్లో ఎన్​పీపీ అద్భుతమైన పనితీరు కనబరిచిందని నరేంద్ర ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఎన్​పీపీ అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మాను ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయనతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. 'మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్​పీపీ అద్భుతంగా పనితీరు రాణించింది. కాన్రాడ్ సంగ్మాకు అభినందనలు. మేఘాలయ పురోగతి కోసం ఆయనతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

హెచ్​ఎస్​పీడీపీ, పీడీఎఫ్​, స్వతంత్రులు​, బీజేపీ.. ఎన్​పీపీకి మద్దతు ఇస్తున్నాయని మేఘాలయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ తెలిపారు. మార్చి 7న మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ఆ రోజే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని చెప్పారు.

మార్చి 2 న విడుదలైన ఫలితాల్లో మేఘాలయలో హంగ్​ అసెంబ్లీ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఏ పార్టీకీ రాలేదు. అయితే.. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) 26 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి బీజేపీ మద్దతు ప్రకటించింది.

మేఘాలయ ఎన్నికల ఫలితాలు..

  • ఎన్​పీపీ-26
  • యూడీపీ-11
  • కాంగ్రెస్-5
  • టీఎంసీ-5
  • భాజపా-2
  • ఇతరులు-11

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.