ETV Bharat / bharat

సాహిత్యంలో చిచ్చరపిడుగు- చిన్నవయసులోనే 4 పుస్తకాలు రాసిన అమ్మాయి - 4 పుస్తకాలు రాసిన అమ్మాయి

Young Girl Wrote 4 Books : చిన్న వయసులోనే నాలుగు పుస్తకాలు రాసి అబ్బురపరుస్తోంది ఓ 16 ఏళ్ల అమ్మాయి. సాహిత్యంపై మక్కువతో ఇప్పటివరకు 500కు పైగా కవితలు రాసింది. తన ప్రతిభతో పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డ్స్​లో చోటు సంపాదించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం.

Young Girl Wrote 4 Books
Young Girl Wrote 4 Books
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 7:45 PM IST

Young Girl Wrote 4 Books : 16 ఏళ్ల వయసులోనే నాలుగు పుస్తకాలు రాసి ఔరా అనిపిచింది ఓ అమ్మాయి. సాహిత్యంపై మక్కువ పెంచుకుని ఇంగ్లిష్, హిందీ భాషల్లో 500కు పైగా కవితలు రాసింది. వాటిని నాలుగు కవితా సంపుటాలుగా వెలువరించింది. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన ఈ అమ్మాయి పలు ప్రతిష్టాత్మక రికార్డులు సైతం సొంతం చేసుకుంది. ఆమెనే కర్ణాటకకు చెందిన అమన. జె. కుమార్.

కేఎస్​ఆర్​టీసీ సీపీఆర్​ఓ డాక్టర్​ లత టీఎస్, జైవంత్ కుమార్​ దంపతుల కుమార్తె అమన. సాహిత్యంపై ఇష్టం పెంచుకున్న అమనా ఆరో తరగతిలోనే కవితలు రాయడం మొదలుపెట్టింది. అలా కొన్ని కవితలు రాశాక వాటిని ప్రచురించాలనుకుంది. 'ఈకోస్ ఆఫ్ సోల్​ఫుల్ పోఎమ్స్​' అనే శీర్షికతో మొదటి కథా సంపుటిని వెలువరించింది. ఆ తర్వాత 'వరల్డ్​ అమిడ్​స్ట్ ది వర్డ్స్' అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఇక హిందీలో రాసిన మూడో కవితా కంపుటిని 'లఫ్రోన్​ కీ మెహ్​ఫిల్' అనే పేరుతో తీసుకొచ్చింది. ఈ సమయంలోనే హార్వర్డ్​ విశ్వవిద్యాలయం నుంచి 'మాస్టర్​పీస్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్' అనే కోర్సును పూర్తి చేసింది.

Amana J Kumar Fourth Book : ప్రస్తుతం బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికళ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమన తాజాగా నాలుగో పుస్తకం కూడా రాసింది. 'గాలోర్​ ఆఫ్​ మిస్టరీస్​' అనే ఈ పుస్తకాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్​ సంతోశ్ హెగ్డే విడుదల చేశారు. 'ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి పుస్తకం. పాఠకులు ఈ పుస్తకాన్ని అభినందిస్తారు' అని విశ్వాసం వ్యక్తం చేశారు.

Young Girl Wrote 4 Books
పుస్తకం ఆవిష్కరిస్తున్న జస్టిస్ ఎన్​ సంతోశ్ హెగ్డే

అమన సాధించిన రికార్డులు :

  • భారతదేశపు అతి పిన్న కవయిత్రిగా ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​- 2021లో చోటు సంపాదించింది.
  • చిన్న వయసులోనే కవితలు రాసినందుకు ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్ 2021 సొంతం చేసుకుంది.
  • కౌటిల్య జూనియర్ పొయెట్ అఫ్​ ది ఇయర్ అవార్డును 2021లో గోవా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకుంది.
  • అతిపిన్న కవయిత్రిగా నోబెల్ బుక్​ ఆఫ్ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది.
  • గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2022
  • అతి పిన్న కవయిత్రి- వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
  • యంగెస్ట్ పోయెట్ - ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్

Galore of Mysteries : అమన రాసిన మొదటి ఫిక్షన్​ పుస్తకం 'గాలోర్​ ఆఫ్​ మిస్టరీస్'కు సందేశం కర్ణాటక గవర్నర్ తవర్ చంద్ర గెహ్లోత్ రాశారు. ముందుమాట ఇస్రో శాస్త్రవేత్త, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. వీర ముత్తువేల్ రాశారు. 'గాలోర్​ ఆఫ్​ మిస్టరీస్' అనే పుస్తకం ఒక మిస్టరీని అన్వేషించే కవితలు, చిన్న కథల సమాహారం.

ఫ్రెంచ్ రచయిత్రికి సాహిత్య నోబెల్.. 17వ మహిళగా రికార్డు..

81 ఏళ్ల వయస్సులో అలుపెరగని సాహిత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.