ETV Bharat / bharat

చోళుల కాలం నాటి గుడిలో యువతికి కీలక బాధ్యతలు - తమిళనాడు న్యూస్

తమిళనాడులో 28ఏళ్ల యువతి అరుదైన ఘనత సాధించింది. ఆలయంలో ఒథువార్​గా ఎంపికైన రెండో మహిళగా నిలిచింది. స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్​ ఆమెకు అపాయింట్​మెంట్ ఆర్డర్ ఇచ్చారు. శివాలయంలో తొలి రోజు ఆమె ఆలపించిన భక్తిగీతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో అది కాస్తా వైరల్​గా మారింది.

first woman odhuvar in temple
తమిళనాడులో 28ఏళ్ల యువతి అరుదైన ఘనత
author img

By

Published : Aug 17, 2021, 5:51 PM IST

Updated : Aug 17, 2021, 6:55 PM IST

శివాలయంలో భక్తి గీతాలు ఆలపించాలనే ఓ తమిళనాడు మహిళ కల సాకారమైంది. చెన్నై శివారు మదంబక్కంలోని చోళుల కాలం నాటి గుడిలో ఒథువార్​గా ఎంపికైంది. రాష్ట్రంలో ఈ అవకాశం దక్కించుకున్న రెండో మహిళగా నిలిచింది.

సాధారణంగా పురుషులు మాత్రమే ఈ వృత్తిలో ఉంటారు. అయితే డీఎంకే ప్రభుత్వం అధికారంలో వచ్చాక తమిళనాడులోని అన్ని గుళ్లలో పురోహితులు సహా ఇతర బాధ్యతలు నిర్వహించే అవకాశం మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తోంది.

ఒథువార్​గా ఎంపికైన ఈ 28 ఏళ్ల మహిళ పేరు సుహంజన. చిన్నప్పటి నుంచే సంగీతం, భక్తి గీతాలంటే అమితాసక్తి. అందుకే డిగ్రీనో, ఇంజినీరింగో చదవకుండా ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరింది. దైవ భక్తి గీతాలు, సంప్రదాయ సంగీతంలో మంచి నైపుణ్యం సాధించింది. ఒథువార్​గా ఆగస్టు 15న బాధ్యతలు చేపట్టిన సుహంజన.. గాత్రం చూసి నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు. తొలిరోజు ఆమె ఆలపించిన శివ భక్తి గీతాన్ని తెగ షేర్ చేశారు. దీంతో అది వైరల్​గా మారింది.

తమిళనాడులో 28ఏళ్ల యువతి అరుదైన ఘనత

ఒథువార్లు అంటే పురోహితులలాగా మంత్రాలు చదవరు. దేవునికి అభిషేకం చేశాక భక్తి గీతాలు ఆలపిస్తుంటారు.

" చిన్నప్పుడు గుళ్లలో ఉత్సవాలు నిర్వహించినప్పుడు, ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు దైవభక్తి గీతాలు పాడేదాన్ని. విద్యార్థి దశలో అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటే నేను మాత్రం సంగీతానికి సంబంధించిన వృత్తిలో స్థిరపడాలనుకున్నా. మా నాన్న ఉద్యోగ రిత్యా మా కుటుంబం కరూర్ జిల్లా వెలాయుథంపలాయంలో ఉండేది. దైవభక్తి వైపు మళ్లాక తమిళ సంగీతంలో నైపుణ్యం సాధించాలనుకున్నా. నా తల్లిదండ్రులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. కరూర్​లోని ప్రభుత్వ సంగీత కళాశాలలోనే చేరా. కుమార స్వామినాథన్​ దగ్గరు తేవరం, తిరవసాగం నేర్చుకున్నా. ఒథువార్లుగా మహిళలు ఉండరని, ఈ సంప్రదాయన్ని తదుపరి తరానికి కొనసాగించాలని ఆయన చెప్పేవారు. "

-సుహంజన

పెళ్లన తర్వాత మదంబక్కం సమీపంలోని సెలయుర్​లో స్థిరపడింది సుహంజన. ఈమె భర్త గోపీనాథ్​ డిజైన్ ఇంజినీర్​. సంగీతం పట్ల ఈమెకున్న ఆసక్తిని గమనించి ఇంట్లో వారంతా ప్రోత్సహించారు.

పెళ్లికి ముందు ఓ స్వచ్ఛంద సంస్థలో టీచర్​గా పనిచేశా. పిల్లలకు దైవభక్తి గీతాలు నేర్పించా. వివిధ గుళ్లలో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన చూసి దరఖాస్తు చేశా. మహిళలు కూడా అప్లై చేయొచ్చు అని ప్రకటనలో ఉంది. దరాఖాస్తు చేశాక ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఊహించని విధంగా ఎంపికయ్యా. సీఎం ఎంకే స్టాలిన్​ నుంచి అపాయింట్​మెంట్ ఆర్డర్ తీసుకున్నా. ఈ కార్యక్రమానికి శివ మఠం అధిపతులు కూడా హాజరయ్యారు. ఒథువార్​ కావాలనుకునే మహిళలకు నేను ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా.

-సుహంజన

ఒథువార్​గా నియామకమైన సుహంజనకు అలవెన్సులు కాకుండా నెలకు రూ.18వేల జీతం వస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

సుహుంజన కంటే ముందు 2006లో తమిళనాడులో మొట్టమొదటి ఒథువార్​గా దళిత మహిళ అంగయార్కన్నీ ఎంపికైంది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఈమెకు అవకాశమిచ్చారు. అయితే నెలకు రూ.1500 జీతమే కావడం వల్ల 2018లో ఆమె వృత్తిని వీడారు. అయితే జీతం పెంచి తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని 2016నుంచి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

తమిళనాడువ్యాప్తంగా వివిధ గుళ్లలో ఉన్న 196 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసింది. 58 పురోహితులు కావాల్సి ఉండగా.. ఇందులో ఐదుగురు దళితులు, 16 మంది ఓబీసీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఒథువార్లుగా 20 మందిని నియమించగా.. అందులో ఒకరు సుహంజన.

ఇదీ చూడండి: ఒడిశా విద్యార్థి సూక్ష్మ కళాఖండం- అచ్చం పూరీ ఆలయంలాగే..

Last Updated : Aug 17, 2021, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.