వారిద్దరు ఒకే చోట చదువుకున్నారు. ప్రేమించి పెళ్లాడారు. కలిసుండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించేలోపే ఆ గ్రామ పంచాయతీ తీర్పు వారిద్దరిని విడిపోయేలా చేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మేరఠ్‌లోని ఓ కళాశాలలో శివమ్ అనే యువకుడు, తనూ అనే యువతి కలిసి చదువుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వారిద్దరు దైవ సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి విషయం ఆ గ్రామ పెద్దల చెవిన పడింది. అంతే ఇక వారిద్దరిని వేరు చేసేందుకు ఓ నిర్ణయాన్ని తీసుకుని తీర్పు వెలువరించారు.
దంపతులు ఒకే ఊరి వారని, వీరిద్దరి గోత్రం ఒకటేనని గ్రామపంచాయతీ పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి వారికి వివాహం జరిపిస్తే ఊరికి మంచిది కాదని అంటున్నారు. లెక్కప్రకారం వీరిద్దరూ అన్నాచెల్లెల్లు అవుతారని అందువల్ల వీరి వివాహం రద్దు చేస్తున్నామని తీర్పు ఇచ్చారు. గ్రామ పెద్దలిచ్చిన తీర్పుకు అందరూ ఆశ్చర్యపోయారు. షాక్‌కు గురైన ప్రేమ జంటకు తమ కుటుంబసభ్యుల ఆదరణ సైతం కరవవ్వడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వీరి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: డీజీ హత్య కేసులో పని మనిషి అరెస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
యాప్‌లో రూ.5వేలు లోన్.. వడ్డీతో కలిపి రూ.80వేలు బాదుడు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య