medicine students stole rings: రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య విద్యార్థులు దొంగతనాలకు అలవాటు పడ్డారు. నగల దుకాణాల్లో ఉంగరాలతో ఉడాయించారు. ఈ ఘటన పుణెలో జరిగింది.
![stole a rings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13910286_570_13910286_1639548486064.png)
ప్రేయసి కోసం..
student robbed jewellery: పుణెలోని హడాప్సర్, కొత్రుడ్ ప్రాంతంలోని నగల దుకాణాల్లో ఇద్దరు యువకులు కలిసి దొంగతనాలకు పాల్పడ్డారు. ఒకతను కస్టమర్లా వచ్చి.. వ్యాపారిని ఏమార్చి ఉంగరాలతో ఉడాయించాడు. పారిపోవడానికి షాప్ బయట మరొక యువకుడు బైక్ను సిద్ధం చేసి ఉంచాడు. ఈ ఘటనపై నగల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఆధారాలతో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.5 లక్షల విలువైన ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు లాతూర్కు చెందిన అంకిత్ హనుమంత్ రొకాడే(23), మరొకరు వాషిమ్ జిల్లాకు చెందిన వైభవ్ సంజయ్ జగ్తాప్(22)గా పోలీసులు గుర్తించారు. వైద్య విద్య అభ్యసిస్తున్న ఈ విద్యార్థులు జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డారని తెలిపారు. తమ ప్రేయసికి కానుక ఇవ్వడానికి ఉంగరాలను దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
![stole a rings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-pun-01-crime-jvelars-shopp-chori-avb-7210732_15122021091039_1512f_1639539639_944.jpg)
ఇదీ చదవండి:
Drugs Seized: హెల్మెట్, స్టెతస్కోప్లో రూ. 13 కోట్ల డ్రగ్స్!