కొవిడ్‌పై ప్రపంచ దేశాలతో సమష్టి పోరాటంలో భారత్ ముందుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ఇతర దేశాలకు భారత్ వ్యాక్సిన్ అందించడంపై శుక్రవారం ఈ విధంగా స్పందించారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా సహకారం అందించడమే భారత్‌కు ముఖ్యమని పేర్కొన్నారు.
"సరిహద్దు దేశాలకు ఇప్పటికే వైద్య సాయం అందించాం. సంబంధిత దేశాల నిపుణులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ప్రధాని మంత్రి వ్యాఖ్యలను మనం గుర్తు చేసుకోవాలి."
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి
భారత్‌లోని టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని మానవాళికి ఉపయోగపడేలా వినియోగిస్తామని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి : యూకే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్