కేరళ అసెంబ్లీ స్పీకర్‌గా ఎంబీ రాజేశ్ ఎన్నికయ్యారు. దీంతో కేరళ అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించి.. స్పీకర్ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రత్యర్థి యూడీఎఫ్ అభ్యర్థి పీసీ విశ్వనాథ్‌పై 96 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్.. రాజేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్ కేరళ 15వ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.
![MB Rajesh elected as Speaker of Kerala Assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11887201_1.jpg)
![MB Rajesh elected as Speaker of Kerala Assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11887201_3.jpg)
![MB Rajesh elected as Speaker of Kerala Assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11887201_6.jpg)
ఎంబీ రాజేశ్.. త్రిథల నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
ఇదీ చదవండి : దూసుకొస్తున్న 'యాస్'- ఈదురుగాలుల బీభత్సం