ETV Bharat / bharat

'కృష్ణుడి జన్మస్థలిలో మసీదు నిర్మాణం'.. మథుర కోర్టు కీలక ఆదేశాలు

Shahi Idgah Mosque Case : శ్రీకృష్ణుడి జన్మలంలో మసీదు నిర్మించారన్న పిటిషన్‌పై ఉత్తర్​ప్రదేశ్​లోని మథుర సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానిజాలు వెలికితీసే బాధ్యతను పురావస్తు శాఖకు అప్పగించింది.

Mathura Court Orders
మథుర కోర్టు తీర్పు
author img

By

Published : Dec 24, 2022, 3:40 PM IST

Updated : Dec 24, 2022, 6:11 PM IST

Shahi Idgah Mosque Case : శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర సివిల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిజానిజాలు వెలికి తీసే బాధ్యతను భారత పురావస్తుశాఖ అధికారులకు అప్పగించింది. శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశంగా భావిస్తున్న షాహి ఇద్గా మసీదులో జనవరి 2నుంచి పురావస్తుశాఖ అధికారులు సర్వే చేయాలని స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను జనవరి 20న కోర్టుకు సమర్పించాలని సూచించింది.

మథురలో 17వ శతాబ్దానికి చెందిన షాహి ఇద్గా మసీదును కత్రా కేశవ్‌ దేవ్‌ ఆలయాన్ని కూల్చి నిర్మించారని ఆ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా.. మథుర సివిల్‌ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. 13.37 ఎకరాల్లో విస్తరించి ఉన్న కత్రా కేశవ్‌ దేవ్‌ ఆలయ ప్రాంగణంలో మసీదును నిర్మించారని కోర్టుకు తెలిపారు. 1669-1770 మధ్య మెుఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో.. శ్రీకృష్ణుడి జన్మ భూమిలో మసీదు నిర్మాణం జరిగిందని కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం మసీదులో సర్వేకు ఆదేశించింది.

Last Updated : Dec 24, 2022, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.