Mathura Building Collapse : ఉత్తరప్రదేశ్.. మధురలోని బాంకే బిహారి దేవాలయం సమీపంలో పురాతన భవనం కూలిపోయిన ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు. దేవాలయం నుంచి ఇంటికి వెళ్తున్న భక్తులపై బాల్కనీలోని పెద్ద భాగం కూలిపోయింది. వారిని రక్షించే సమయంలో భవనంలోని మరో గోడ కూలిపోయిందని పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు.. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇదీ జరిగింది..
Building Collapse On Devotees : మధుర జిల్లా బాంకే బిహారి ఆలయానికి 200 మీటర్ల దూరంలో ఓ పెద్ద భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఆ భవనంలో చాలా రోజుల నుంచి కోతులు తిరుగుతున్నాయి. ఇటీవలే మధ్య కురిసిన వర్షాలకు భవంతి పూర్తిగా దెబ్బతింది. కాగా మంగళవారం సాయంత్రం భవనం గోడ కూలి.. పక్కనే నడుస్తున్న భక్తులపై పడింది. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను గీతా కష్యప్ (50), అరవింద్ కుమార్ యాదవ్ (35), రష్మీ గుప్తా (52), అంజు మురుగన్ (51), చందన్ రాయ్ (28)గా అధికారులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
మధుర వెళ్తుండగా ప్రమాదం..
UP Tractor Accident : ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో పదిరోజుల క్రితం ట్రాక్టర్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరంతా ఎటా జిల్లాలోని జలేసర్ నుంచి మథురలోని గోవర్ధన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కథనాన్ని పూర్తిగా చదవడానికి ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయండి.
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల్లో ఐదుగురు!
పాత భవనం కూలి 14 మంది మృతి.. ఉండొద్దని హెచ్చరించినా నివాసం..