ETV Bharat / bharat

గుడ్​న్యూస్​.. ఇకపై అక్కడ మాస్కులు అవసరం లేదు! - కొవిడ్​ ఆంక్షలు ముంబయి

Mask Free Mumbai: కొవిడ్​ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముంబయిలో మాస్కులు ధరించాలన్న నిబంధనను త్వరలోనే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దేశంలో మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది.

covid
కరోనా మాస్క్
author img

By

Published : Mar 23, 2022, 10:52 PM IST

Mask Free Mumbai: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గత రెండేళ్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. నిబంధనలను ఉల్లఘించిన వారిపై జరిమానా విధించడం సహా కఠిన చర్యలు చేపడుతున్నారు అధికారులు. అయితే ఇకపై ఈ నిబంధనలకు చెక్​ పెట్టనుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కేసులు తగ్గిన కారణంగా ముంబయిలో క్రమంగా కొవిడ్​ ఆంక్షలను తొలగిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే మాస్కులు ధరించాలన్న నిబంధనను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముంబయి వాసులకు ఊరట లభించినట్లైంది.

మరోవైపు.. దేశంలో మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా.. వారికి సమాచారమిచ్చారు. దేశంలో రెండేళ్ల క్రితం కొవిడ్‌ విజృంభించగా.. వైరస్‌ కట్టడికి 2020 మార్చి 24న మొదటిసారి కేంద్రం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత కేసుల సంఖ్యలో మార్పులను బట్టి పలు సందర్భాల్లో ఆంక్షలను సడలించింది.

ఇదీ చూడండి : బంగాల్ బీర్భుమ్​​ ఘటనపై మోదీ సీరియస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.