ETV Bharat / bharat

కట్నం కోసం హత్య.. మృతదేహానికి నిప్పు.. బాధితురాలి కాలుతో స్టేషన్​కు తండ్రి - కట్నం కోసం హత్య

వరకట్నం కోసం మహిళను అత్తింటివారు దారుణంగా హత్య చేశారు. ఆధారాలు దొరకకుండా పూడ్చిపెట్టారు. అంతటితో ఆగకుండా బయటకు తీసి కాల్చేశారు. ఈ అమానుష సంఘటన బిహార్​లోని భోజ్​పుర్​ జిల్లాలో వెలుగు చూసింది.

MURDER
బాధితురాలి కాలుతో స్టేషన్​కు తండ్రి
author img

By

Published : Jun 9, 2022, 7:08 PM IST

వరకట్న దాహనానికి ఓ వివాహిత బలైపోయింది. ధనదాహంతో అత్తింటివారే హత్య చేసి.. తమ నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాధితురాలిని నది ఒడ్డున పూడ్చిపెట్టారు. అంతటితో సంతృప్తి పడక బయటకు తీసి కాల్చేశారు. ఈ దుర్ఘటన బిహార్​లోని భోజ్​పుర్​ జిల్లాలో వెలుగు చూసింది.

ఇదీ జరిగింది: ముఫాసిల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బరౌలీ గ్రామానికి చెందిన శత్రుఘ్న బింద్​​తో.. బభన్​గామా గ్రామానికి చెందిన అఖిలేశ్​ బింద్​ కుమార్తె మమతా దేవికి 2021, మేలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కొంత వరకట్నం ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత వ్యాపారం చేసేందుకు రూ.2 లక్షలు తేవాలని అత్తింటివారు వేధించటం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇటీవలే తల్లిదండ్రులకు తెలియజేసింది బాధితురాలు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్​ రాలేదు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల వారి డిమాండ్​ను తీర్చలేకపోయారు. గుజరాత్​లోని రాజ్​కోట్​కు వలసవెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

MURDER
సంఘటనాస్థలంలో పోలీసులు, స్థానికులు

తాము అడిగిన కట్నం ఇవ్వలేదనే కోపంతో మమతా దేవిని హత్య చేసిన భర్త, అత్తింటివారు.. ఆధారాలు లేకుండా చేసేందుకు గుట్టుగా పూడ్చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఓ కారును అద్దెకు తీసుకుని సరిపుర్​ విశ్వన్​పుర్​ గ్రామం సమీపంలో నది ఒడ్డున పూడ్చేశారు. ఆ తర్వాత కారును పంపించేశారు. కానీ, వారు అంతటితో సంతృప్తి చెందలేదు. మృతదేహాన్ని బయటకు తీసి కాల్చేశారు.

కారు డ్రైవర్​ను కొందరు గ్రామస్థులు పట్టుకుని విచారించగా.. అసలు విషయం బయటడింది. వెంటనే వారు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముఫాసిల్​ పోలీసులతో కలిసి వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే.. 90 శాతం మేర మృతదేహం కాలిపోయింది. కేవలం ఎడమ కాలు మాత్రమే మిగిలింది. దాని ద్వారానే బాధితురాలిని గుర్తించారు. మిగిలిన కాలును పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లాడు బాధితురాలి తండ్రి.

బాధితురాలి భర్త శత్రుఘ్న బింద్​, మామ రామ్​ ప్యార్​ బింద్​పై ముఫాసిల్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. బాధితురాలి కాలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డీఎన్​ఏ, ఫొరెన్సిక్​ పరీక్షల కోసం బిహార్​ రాజధాని పట్నాకు పంపించారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలిపై కిరోసిన్​ పోసి నిప్పు.. అత్తింటివారి ఘాతుకం!

సెక్యూరిటీ గార్డును కొట్టి కట్టేసి.. పెట్రోల్​ బంకుల్లో లక్షలు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.