ETV Bharat / bharat

ఒకేసారి ఆరుగురు అక్కాచెల్లెళ్ల వివాహం - ఆరుగురు అక్కచెల్లెళ్ల పెళ్లి

రాజస్థాన్​లోని ఝున్​ఝును జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకేసారి ఆరుగురు అక్కాచెల్లళ్ల వివాహం జరగడం విశేషం.

d
d
author img

By

Published : Nov 27, 2021, 11:00 AM IST

Updated : Nov 27, 2021, 4:54 PM IST

ఒకేసారి ఆరుగురు అక్కాచెల్లెళ్ల వివాహం

పెళ్లి అంటేనే సందడి. ఇంట్లో జరిగే పెళ్లి వేడుక గురించి ఊరంతా చెప్పుకోవాలని అనుకుంటారు వధూవరుల తల్లిదండ్రులు. రాజస్థాన్​లోని ఝున్​ఝును జిల్లా ఖేతడీలో జరిగిన ఓ వివాహం ఇప్పుడు స్థానికంగానే కాదు దేశమంతటా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇక్కడ ఒకేసారి ఆరుగురు అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు జరిగాయి.

స్కూల్​ బస్​ డ్రైవర్​గా పనిచేసే రోహితాక్షవ్​కు ఏడుగురు కూమార్తెలు, ఓ కుమారుడు. వీరిలో పెళ్లి ఈడు వచ్చిన ఆరుగురు కుమార్తెలకు వివాహం చేయాలని రోహితాక్షవ్ భావించాడు. ఆరుగురు కూమార్తెలలో ఇద్దరేసి చొప్పున ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఓ కుటుంబంతో సంబంధం నిశ్చయం చేశాడు. పెద్ద కుమార్తె మీనా దుఖేరా, మూడో కుమార్తె సీమాల వివాహం.. హరియాణాకు చెందిన నరేశ్​, భైరూసింగ్​తో జరిగింది. రెండవ కుమార్తె అంజు, నాలుగో కుమార్తె నిక్కీలు నీమ్​కాఠాణాకు చెందిన ధర్మవీర్, విజేంద్రలను పెళ్లాడారు. అదే విధంగా యోగితా, సంగీతల వివాహం.. కుతానియాకు చెందిన ప్రదీప్​, మోహిత్​లతో జరిగింది.

marriage of six sisters together
పెళ్లికూతుర్లతో సోదరుడు వికాస్​ గుర్జార్
marriage of six sisters together
రోహితాక్షవ్​ కుటుంబం

ఘనంగా పెళ్లి వేడుకలు..

పెళ్లి బారాత్​కు పసుపు దుస్తులు ధరించి, డీజేలో కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి కూతుర్లు వేసిన స్టెప్పులు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి.

marriage of six sisters together
కుటుంబసభ్యులతో కలిసి వధువుల డ్యాన్స్​

ఈ వధువులు సమాజిక సేవలో కూడా ముందుంటారు. కరోనా సమయంలో సోదరుడు వికాస్​ గుర్జార్ ఆధ్వర్యంలో మాస్కులు కుట్టి గ్రామమంతా పంచారు. స్కౌట్​గా సేవలకుగాను వికాస్​ గుర్జార్​కు రాష్ట్రపతి అవార్డు కూడా దక్కింది. ​

ఆరుగురి కూతుళ్ల వివాహంతో తండ్రి రోహితాక్షవ్ సహా కుటుంబసభ్యులు​ ఉబ్బితబ్బిపోయారు. అదే సమయంలో వివాహాలు పూర్తయ్యాక భావోద్వేగానికి లోనయ్యారు.

ఇదీ చూడండి : Barmer daughter: కట్నం డబ్బులు.. గర్ల్స్ హాస్టల్​ నిర్మాణానికి విరాళం

Last Updated : Nov 27, 2021, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.