ETV Bharat / bharat

'మారడోనా వాచ్ మాత్రమే కాదు.. చాలా వస్తువులు కొట్టుకొచ్చాడు!' - మారడోనా వాచ్ చోరీ కేసు

Maradona watch thief: ఫుట్​బాల్ దిగ్గజం మారడోనా వాచ్ చోరీ కేసులో నిందితుడు వాజిద్ హుస్సేన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. టోపీ, షూస్​, ఐపాడ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వస్తువుల్లో ఏవి మారడోనాకు చెందినవో తెలియాల్సి ఉందన్నారు.

maradona memorabilia
మారడోనా వాచ్ చోరీ కేసు
author img

By

Published : Dec 12, 2021, 4:45 PM IST

Maradona watch thief: ఫుట్​బాల్ దిగ్గజం మారడోనాకు చెందిన ఖరీదైన చేతి గడియారాన్ని చోరీ చేసిన వ్యక్తి ఇంట్లో ఇతర వస్తువులు కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. టోపీ, షూస్, ఓ బొమ్మ, మరికొన్ని వస్తువులు ఉన్నట్లు చెప్పారు.

maradona memorabilia
నిందితుడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు

"మారడోనా చేతి గడియారం చోరీ కేసులో అరెస్టయిన వాజిద్ హుస్సేన్​ ఇంట్లో.. జాకెట్, ట్రాక్ ప్యాంట్​, టీషర్ట్​, షూస్, బొమ్మ, లైటర్స్, టోపీ, ఐపాడ్స్​ స్వాధీనం చేసుకున్నాం" అని అసోం డీజీపీ జీపీ సింగ్ ట్వీట్​ చేశారు.

అయితే ఈ వస్తువుల్లో ఏవి మారడోనాకు చెందినవో నిర్ధరించాల్సి ఉందన్నారు. ఈ వస్తువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్న దానిపైనా విచారణ చేస్తామని తెలిపారు.

అసోం, శివసాగర్ జిల్లాలో నిందితుడు వాజిద్ హుస్సేన్ ఇంట్లో శనివారం రాత్రి ఈ తనిఖీలు నిర్వహించారు పోలీసులు.

దుబాయ్​లో మారడోనా వ్యక్తిగత వస్తువులను భద్రపరుస్తున్న ఓ కంపెనీలో నిందితుడు సెక్యూరిటీ గార్డ్​గా పనిచేశాడు. కొద్దిరోజుల తర్వాత తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఇంటికి వచ్చేశాడు. అంతకుముందే హుబ్లట్ వాచీని ఉంచిన లాకర్​లో దొంగతనం జరిగింది. ఇది వాజిద్ పనేనని అధికారులు అనుమానించారు. దీంతో భారత్​లోని ఏజెన్సీలకు సమాచారం అందించారు. అసోం పోలీసులు రంగంలోకి దిగి పని పూర్తి చేశారు.

ఇదీ చూడండి: దుబాయ్​లో మారడోనా వాచీ చోరీ.. ఇండియాలో నిందితుడు అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.