ETV Bharat / bharat

గంగానది ఒడ్డున ఇసుకలో మృతదేహాల కలకలం

ఉత్తర్​ప్రదేశ్​ గంగానది తీరాన ఇసుకలో పాతిపెట్టిన మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. ఉన్నావ్​ జిల్లాలో గంగా ఘాట్​లలో ఇలా కుప్పలు తెప్పలుగా శవాలు వెలుగు చూడటం.. స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.

Ganga river, Dead bodies in Sand
గంగానది, మృతదేహాలు
author img

By

Published : May 13, 2021, 1:33 PM IST

గంగానది ఒడ్డున ఇసుకలో మృతదేహాల కలకలం!

బిహార్​ గంగానదిలో మృతదేహాలు తేలిన ఘటన మరువకముందే.. ఉత్తర్​ప్రదేశ్​లో మరొకటి వెలుగుచూసింది. ఉన్నావ్​లోని గంగానది ఒడ్డున ఇసుకలో కుప్పలు తెప్పలుగా శవాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలన్నింటికీ ఒకే రకమైన(కాషాయ) వస్త్రం చుట్టి ఉండటం చర్చనీయాంశమైంది.

ఇవన్నీ గత నెలలో సంభవించిన కొవిడ్​ మరణాలేనని స్థానికులు ఆరోపించగా.. వీటిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని స్థానిక జిల్లా మేజిస్ట్రేట్​ రవీంద్ర కుమార్​ తెలిపారు.

"చనిపోయిన వారిని చాలా మంది దహనం చేస్తుండగా.. కొందరు మాత్రం ఇసుకలో పాతి పెడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి రాగానే.. ఘటనా స్థలానికి అధికారుల్ని పంపాం. దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారిని కోరాం. తదనుగుణంగా చర్యలు చేపడతాం."

- రవీంద్ర కుమార్​, ఉన్నావ్​ జిల్లా మేజిస్ట్రేట్​

ఇదీ చదవండి: నీటిలో మృతదేహాలు.. వైరస్‌ సంక్రమిస్తుందా?

ఈ మృతదేహాలలో ఎక్కువగా.. హాజీపుర్​లోని రౌతాపుర్​ గంగా ఘాట్​ వద్ద ఖననం చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒక్కసారిగా బయటపడటం వల్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రస్తుతం.. ఈ శవాలను వెలికితీస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా దీన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.

కరోనా మాహమ్మారి విజృంభణతో అక్కడ మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దహన సంస్కారాల ధరలు కూడా పెరిగాయి. ఈ ఖర్చులను భరించలేని ప్రజలు.. ఇలా మృతదేహాలను ఖననం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి: ఆదర్శ మహిళ- 3వేల కొవిడ్​ శవాలకు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.