Assam Gold Tea 1KG Price: మన దేశంలో చాయ్‌కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ అసోం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తి అయిన టీ పొడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన టీ పొడులను వేలం వేస్తాయి. ఈ క్రమంలో శనివారం.. మనోహరి గోల్డ్ టీ రికార్డ్ నమోదు చేసింది. వేలంలో కిలో టీ పొడి రూ. 1.5 లక్షలకు అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.99,999గా ఉంది.
హైదరాబాద్‌కు చెందిన నీలోఫర్ కేఫ్ యజమాని కె.బాబూరావు ఈ గోల్డ్ టీని రూ.1.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు మనోహరి టీ ఎస్టేట్ యజమాని రాజన్ లోహియా తెలిపారు. ఈ టీ పొడిని తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో టీ గార్డెన్లో తీసిన సింగిల్ బడ్స్‌తో తయారుచేస్తామని తెలిపారు. మనోహరి గోల్డ్ టీ పొడితో తయారు చేసిన టీని ఒక కప్.. రూ.1000కు విక్రయిస్తామని నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు చెప్పారు.