ఐదేళ్ల పిల్లలు ఏది మాట్లాడినా ముద్దుముద్దుగా ఉంటుంది. అలాంటిది ఆ బాలుడు మూడు భాషలను అలవోకగా, స్పష్టంగా మాట్లాడేస్తాడట. ఇదే విషయాన్ని గురువారం దిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత మనీశ్ సిసోదియా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
-
Today, I made a new little friend. At the age of five, he is fluent in three different languages: French, Sanskrit, and English.
— Manish Sisodia (@msisodia) October 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
It was really nice to meet you, Hiten. pic.twitter.com/fm0K0TlI2O
">Today, I made a new little friend. At the age of five, he is fluent in three different languages: French, Sanskrit, and English.
— Manish Sisodia (@msisodia) October 7, 2021
It was really nice to meet you, Hiten. pic.twitter.com/fm0K0TlI2OToday, I made a new little friend. At the age of five, he is fluent in three different languages: French, Sanskrit, and English.
— Manish Sisodia (@msisodia) October 7, 2021
It was really nice to meet you, Hiten. pic.twitter.com/fm0K0TlI2O
"ఈరోజు నాకు ఓ చిన్నారి స్నేహితుడయ్యాడు. అతని పేరు హితెన్. ఐదేళ్ల వయసులోనే మూడు భాషలు.. ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లిష్ అలవోకగా మాట్లడగలడు. హితెన్.. నిన్ను కలవడం చాలా బాగా అనిపించింది" అంటూ అతడితో దిగిన ఫొటోలను సిసోదియా ట్వీట్ చేశారు.
అక్షరాలు, ఎవరైనా మాట్లాడుతుంటే.. వారి వాయిస్‌ను త్వరగా అర్థం చేసుకొని గ్రహించే శక్తి చిన్నవయసు నుంచే హితెన్‌కు అలవడిందట. ప్రస్తుతం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కెందుకు కసరత్తు చేస్తున్నాడీ ఈ బుడతడు.
ఇదీ చూడండి: ఒకే మొక్కకు టమాటా, వంకాయ!