ETV Bharat / bharat

'మణిపుర్​' కోసం సుప్రీం కమిటీ.. సభ్యులుగా మాజీ జడ్జిలు.. సీబీఐ కేసుల పర్యవేక్షణకు ఐపీఎస్ - మణిపుర్ హింస సుప్రీం కోర్టు జడ్జిల కమిటీ

Manipur Violence Supreme Court Hearing : మణిపుర్ హింసపై దాఖలైన పలు పటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ముగ్గురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. సీబీఐ విచారించబోయే కేసులను ఒక ఐపీఎస్​ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపింది. రాష్ట్ర సిట్​లు విచారించే కేసులను సీనియర్​ పోలీసు అధికారులు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించింది.

Manipur Violence Supreme Court Hearing
Manipur Violence Supreme Court Hearing
author img

By

Published : Aug 7, 2023, 4:12 PM IST

Updated : Aug 7, 2023, 5:07 PM IST

Manipur Violence Supreme Court Hearing : మణిపుర్​లో దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న హింస కారణంగా ప్రభావితమైన బాధితుల ఉపశమనం, పునరావాసం కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. ఈ కమిటీకి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం వహిస్తారని.. జస్టిస్ షాలినీ జోషి, జస్టిస్ ఆషా మేనన్‌ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. హింస చెలరేగిన రాష్ట్రంలో న్యాయ పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే తమ ప్రయత్నమని తెలిపింది. ఈ మేరకు మణిపుర్ అల్లర్లపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి, ఉత్తర్వులు జారీ చేసింది.

Manipur Violence Investigation Committee : మాజీ న్యాయమూర్తుల కమిటీతోపాటు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్​ దర్యాప్తు చేసే క్రిమినల్ కేసులను కూడా పోలీసు ఉన్నతాధికారులను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించనున్నట్లు సుప్రీం తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఆర్డర్​ను​ సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో అప్​లోడ్ చేస్తామని వెల్లడించింది. దీంతో పాటు సీబీఐ విచారించబోయే కేసులను ఒక ఐపీఎస్​ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపింది.

  • #WATCH | Manipur Government's advocate K Raghavacharyulu says, "Today the Chief Justice has passed a sensible order and everything will become normal soon. A lot of thought was given before passing this order and we are grateful to the Chief Justice for passing this order." pic.twitter.com/EO8ccK8TPD

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Manipur Violence Case 2023 : విచారణ సందర్భంగా కేంద్రం, రాష్ట్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్​ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మణిపుర్​ హింసపై కుప్పలు తెప్పలుగా నమోదైన కేసులను వేరు చేయడం సహా తదితర అంశాలపై సుప్రీం కోర్టు కోరిన నివేదికను సమర్పించారు. సున్నితమైన మణిపుర్ అల్లర్ల విషయంలో పరిణతితో వ్యవహరిస్తోందని ధర్మాసనానికి అటార్నీ జనరల్ తెలిపారు. అయితే, పునరావాసం ఇతర ఉపశమన చర్యల కోసం దాఖలైన 10 పిటిషన్లపై కూడా సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా మణిపుర్​ డీజీపీ రాజీవ్ సింగ్ కూడా ధర్మాసనం ముందు హాజరయ్యారు. మణిపుర్ జాతి అల్లర్లపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై కోర్టుకు సమాధానం ఇచ్చారు.

  • #WATCH | Delhi: Manipur DGP Rajiv Singh leaves Supreme Court complex.

    DGP arrived at Supreme Court after he was summoned by the court in connection with the Manipur violence case. pic.twitter.com/Xfv5JWvJUP

Manipur Parading Incident : మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటనపై ఆగస్టు 1న అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. మణిపుర్​లో శాంతిభద్రతలు నెలకోల్పడంలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మణిపుర్​ దారుణాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలోనూ అక్కడి పోలీసులు అలసత్వం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్​ఐఆర్​లు దాఖలు తీరు సైతం సరిగ్గా లేదని మండిపడింది. జాతుల మధ్య ఘర్షణలో పరిస్థితులను అదుపులోకి తెచ్చే విషయంలో పోలీసులు చేతులెత్తేశారని పేర్కొంది. అందులో భాగంగా ఆగస్టు 7న కోర్టులో హాజరు కావాలని మణిపుర్ డీజీపీకి సమన్లు జారీ చేసింది.

మణిపుర్​లో ఆగని అల్లరిమూకల ఆగడాలు.. 15 ఇళ్లకు నిప్పు.. ఓ వ్యక్తిపై కాల్పులు..

అసెంబ్లీకి వెళ్లేందుకు భయపడుతున్న కుకీ ఎమ్మెల్యేలు.. సర్కార్​కు ఆ పార్టీ మద్దతు ఉపసంహరణ!

Last Updated : Aug 7, 2023, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.