Manipur CM Peace Talks With Insurgent Group : మణిపుర్‌లోని ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇంఫాల్ లోయకు చెందిన ఓ తిరుగుబాటు దళంతో శాంతి చర్చలు జరుపుతున్నామని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. శాంతి చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు ఓ వార్తాసంస్థకు సీఎం తెలిపారు. త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశభావం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి.. కొన్ని తిరుగుబాటు దళాలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతి చర్చల గురించి అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి.
తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ అనంతరం మణిపుర్‌లో హింసాకాండ మొదలైంది. మే 3న మొదలైన ఈ హింస.. కొన్ని నెలలపాటు కొనసాగింది. జాతుల మధ్య పరస్పర దాడులు, ఇళ్లకు నిప్పుపెట్టడం, ఆయుధాల లూటీ వంటివి జరిగాయి. ఇప్పటివరకు 180 మందికిపైగా మరణించారు. అయితే.. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఆయా హింసాత్మక ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.
నగ్నంగా మహిళల ఊరేగింపు..
Manipur Woman Paraded Video : మైతేయ్ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై.. కొందరు యువకులు కుకీ వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో తమ ఊరి మీదికి కూడా మైతేయ్‌ల గుంపు దాడి చేయనుందనే సమాచారంతో.. మే 4న బీ.ఫయనోమ్ గ్రామంలోని కుకీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) ఒకే కుటుంబం కాగా.. మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అదే సమయంలో వారికి నాంగ్‌పోక్ సెక్మై వద్ద పోలీసులు కనిపించడం వల్ల వారి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి చదివేయండి.
'తీవ్రవాదాన్ని అన్ని రకాలుగా అణిచివేశాం- భారత్ సామర్థ్యానికి ఇదే నిదర్శనం'
లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమునా- విభిన్న మతాల శిల్పకారులతో నిర్మాణం