ETV Bharat / bharat

'మంగళ్​యాన్​-2 సైతం ఒక ఆర్బిటరే​' - Mangalyaan-2

మార్స్​పై భారత్​ చేపట్టబోయే రెండో ప్రయోగం మంగళ్​యాన్​-2 కూడా ఆర్బిటర్​ మిషన్​​ అని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. నాసా పంపిన రోవర్ విజయవంతమైన నేపథ్యంలో భారత్​ నుంచి అరుణ గ్రహంపై చేసే పరిశోధనలపై ఆసక్తి నెలకొంది.

Mangalyaan-2 will be an orbiter mission: ISRO chief
మంగళయాన్-2 ఆర్బిటర్​తోనే.. అప్పుడే ప్రయోగం: శివన్
author img

By

Published : Feb 20, 2021, 5:33 AM IST

అంగారకుడిపై నాసా విజయవంతంగా 'పర్సెవరెన్స్​' రోవర్​ను ప్రవేశపెట్టింది. మార్స్​పై జీవజాలం జాడను కనుగొనుదొనేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే అరుణ గ్రహానికి భారత్​ చేపట్టబోయే తదుపరి ప్రయోగం మంగళ్​యాన్​-2 కూడా 'ఆర్బిటర్ మిషన్​'​ అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ తెలిపారు.

రోవర్​.. అంగారకుడిపై దిగి అక్కడి నమూనాలను భూమిపైకి పంపిస్తుంది. ఆర్బిటర్​.. మార్స్​ కక్ష్యలో తిరగుతూ సమాచారం అందిస్తుంది. అయితే.. ఈ మంగళ్​యా​న్-2 ప్రయోగం ఎప్పుడు చేపడతారో శివన్ స్పష్టతనివ్వలేదు. చంద్రయాన్-3 తర్వాతే దానిని ప్రయోగిస్తామని చెప్పారు. మార్స్​పై ల్యాండింగ్​ చాలా కష్టం అని శివన్ నొక్కి చెప్పారు.

అంగారకుడిపై తొలి ప్రయోగం మార్స్​ ఆర్బిటర్ మిషన్ (మామ్​) విజయవంతమైన తర్వాత రెండో దఫా ప్రయోగం కోసం అవకాశాలను అన్వేషిస్తోంది ఇస్రో. శాస్త్రీయ వర్గాల నుంచి సూచనలు రాగానే వాటిపై చర్చ అనంతరం స్పేస్ కమిషన్ ఓ నిర్ణయం తీసుకుంటుందని శివన్ అన్నారు. మంగళ్​యాన్-1 ఇప్పటికీ బాగా పనిచేస్తూ సమాచారాన్ని చేరవేస్తోందని తెలిపారు.

కరోనా కారణంగా వాయిదా పడిన చంద్రయాన్-3.. 2022లో చంద్రునిపై రోవర్​ను దింపే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: అంతరిక్ష సహకారంపై ఇస్రో, ఆస్ట్రేలియా ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.