ETV Bharat / bharat

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణం.. వృద్ధునిపై మూత్రం పోసిన వ్యక్తి!

తీసుకున్న అప్పు తిరిగివ్వమని అడిగినందుకు ఓ వృద్ధునిపై అతని పక్కింటి వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నిందితుడు తన కుమారుడితో కలిసి వృద్ధుడిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా జిల్లాలో జరిగింది.

fight with old man in agra
fight with old man in agra
author img

By

Published : May 11, 2023, 3:21 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగివ్వమని అడిగినందుకు ఓ వృద్ధునిపై అతడి పక్కింటి వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన కుమారుడితో కలిసి వృద్ధుడి ఇంట్లోకి దూరిన నిండితుడు వీరంగం సృష్టించాడు. రాద్దంతం చేసి ఆ వృద్ధుడ్ని చితకబాదాడు. అంతే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెళ్తున్న ఆ వృద్ధుడిని ఆపి.. నిండితుడి కొడుకు ఆయనపై మూత్రం పోసి అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఆవేదన చెందిన బాధితుడు.. పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించి నిండితులపై ఫిర్యాదు చేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆగ్రాలోని నాగ్లా కరణ్ సింగ్ నైనానా బ్రాహ్మణ ప్రాంతంలో 76 ఏళ్ల ఛత్తర్ సింగ్ కుష్వాహా అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. ఆయన తన పొరుగింటి వ్యక్తి అయిన మూల్​చంద్​కు పది నెలల క్రితం రూ.14,000 సొమ్మును అప్పుగా ఇచ్చాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్​ 30న ఉదయం.. ఛత్తర్​ సింగ్ తనకు రావాల్సిన బాకీని వసూలు చేసేందుకు మూల్​చంద్​ ఇంటికి వెళ్లాడు. కానీ మూల్‌చంద్.. ఆ వృద్ధుడికి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతే కాకుండా ఆయనతో వాగ్వాదానికి దిగి ఆయన్ను క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన ఛత్తర్​ సింగ్​.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో కోపంతో మూల్​చంద్ తన కుమారుడు మురారిని వెంటబెట్టుకుని వృద్ధుడి ఇంటికి చేరుకున్నాడు.

ఛత్తర్​ సింగ్​ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని.. దౌర్జన్యంగా ప్రవేశించిన ఆ ఇద్దరు ఆయన్ను దారుణంగా కొట్టారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఛత్తర్ సింగ్.. ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్​ స్టేషన్​కు బయలుదేరాడు. ఇంతలో ఇదంతా గమనిస్తున్న మూల్​చంద్​ తనయుడు.. వెళ్తున్న వృద్ధుడిని కిందకు తోసి ఆయన ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. ఇక అవమానాన్ని భరించలేక ఛత్తర్​ సింగ్​.. పోలీసులను ఆశ్రయించాడు.

పోలీస్​ స్టేషన్​లో నిందితులపై ఫిర్యాదు చేసినప్పటికీ.. సంబంధిత అధికారులెవరూ ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఛత్తర్​ సింగ్ వాపోయాడు. దీంతో ఛత్తర్​ సింగ్​.. పోలీస్​ కమిషనర్​ వద్దకు చేరుకుని తన గోడును వెల్లబోసుకున్నాడు. జరిగిందంతా విని.. ఇక వృద్ధుని ఆవేదనను అర్థం చేసుకున్న కమిషనర్​.. కేసును పరిశీలించారు​. అనంతరం కేసులోని నిందితులు ఇద్దరిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. తప్పించుకున్న మూల్​చంద్​తో పాటు అతని కుమారుని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.