ETV Bharat / bharat

'విమానాలను హైజాక్​ చేసి పాకిస్థాన్​ తీసుకెళ్తా' - భోపాల్​ ఎయిర్​పోర్టులో హైజాక్​ కలకలం

మధ్యప్రదేశ్​లోని భోపాల్​, ఇండోర్​ విమాశ్రయాల్లో హైజాక్​కు పాల్పడుతానంటూ ఓ వ్యక్తి అధికారులను బెదిరించి కలకలం సృష్టించాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బెదిరింపుల నేపథ్యంలో భోపాల్, ఇండోర్​​ విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

Bhopal and Indore airports, Threat call to hijack plane
హైజాక్​ చేస్తానంటూ బెదిరింపులు..
author img

By

Published : Jun 9, 2021, 3:54 PM IST

Updated : Jun 9, 2021, 4:09 PM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​, ఇండోర్​ ఎయిర్​పోర్టులోని విమానాలను హైజాక్​ చేసి పాకిస్థాన్​కు తరలిస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడు మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటలకు భోపాల్​లోని రాజభోజ్​ విమానాశ్రయ అధికారులకు ఫోన్​ చేసి హైజాక్​ చేస్తానంటూ బెదిరించాడు.

నిందితుడి బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన ఎయిర్​పోర్ట్​ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని భోపాల్​కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న షుజల్​పుర్​లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బెదిరింపుల నేపథ్యంలో భోపాల్, ఇండోర్​​ విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : కుర్రాడికి ఆస్పత్రి ఫోన్.. మీరు చనిపోయారంటూ...

Last Updated : Jun 9, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.