కేరళలో ఓ ఇంటి తలుపులు బద్దలుకొట్టి.. ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తుండగా గమనించిన గ్రామస్థులు వారిని దొంగలుగా అనుమానించి దేహశుద్ధి చేశారు. ట్రిచీలోని అళ్లూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఓ అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు.
అనుమానితులను దీపూర్(30), అరవింద్(25)లుగా గుర్తించిన అధికారులు.. వారిని మహాత్మ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దీపూర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అరవింద్ చికిత్స పొందుతున్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: ఇంటికి నిప్పంటుకొని నలుగురు సజీవదహనం