Man Slaps UP Police: ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో ఎస్సై చెంప చెళ్లుమనిపించాడు ఓ యువకుడు. పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే..?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌కు చెందిన ఎస్సై వినోద్‌కుమార్ గురువారం రాత్రి పనిమీద లఖ్‌నవూలోని హసన్గంజ్కు వచ్చాడు. ఓ బైక్రైడర్ను తప్పించే క్రమంలో.. వినోద్‌కుమార్ కారు.. పక్కనే పార్కింగ్‌లో ఉన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో అక్కడే ఉన్న కొంతమంది వినోద్‌కుమార్ కారు చుట్టూ గుమిగూడారు.
![Man Slaps UP Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-luc-01-dabangsslapauniformedinspectoronthemiddleoftheroadarrested-raw-up10105_03122021081726_0312f_1638499646_0.jpg)
ఈ క్రమంలో ఆశిష్ అనే యువకుడు వినోద్‌తో వాగ్వాదానికి దిగాడు.నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా వినోద్‌ను చెంపదెబ్బ కొట్టాడు. వినోద్ ఫిర్యాదు మేరకు ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. ఆశిష్ వెంట ఉన్న మరికొందరిని అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి: అమలిన ప్రేమ.. 65 ఏళ్ల వయసులో ఒక్కటైన జంట