Man Receives Rs 753 Crore in Bank Account : ఓ మందుల దుకాణంలో పనిచేసే వ్యక్తి ఖాతాలో ఒక్కసారిగా రూ. 753 కోట్ల భారీ నగదు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనిని చూసిన ఆ వ్యక్తి.. కంగుతిని బ్యాంకు అధికారుల వద్దకు పరుగెత్తాడు. వెంటనే అతడి ఖాతాను ఫ్రీజ్ చేశారు అధికారులు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నెలో జరిగింది.
ఇదీ జరిగింది
తిరునెల్వేలికి చెందిన మహ్మాద్ ఇద్రీస్ అనే వ్యక్తి.. పదేళ్ల క్రితం చెన్నైకి పనికోసం వచ్చాడు. తెన్నంపేట్లో ఉంటూ అక్కడే ఉన్న ఓ మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే, శనివారం ఉదయం తనకున్న అన్నా రోడ్‌లోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి స్నేహితుడికి రూ.2 వేలు పంపించాడు. వెంటనే అతడికి తన ఖాతాలో రూ.753.48 కోట్ల నగదు ఉన్నట్లు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌ను చూసిన ఇద్రీస్.. ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు.. వెంటనే అతడి బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు.
"ఉదయాన్నే ఫోన్ చూసేసరికి మీ ఖాతాలో రూ.753.48 కోట్లు ఉన్నట్లు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూశాను. అందులోనూ రూ.753 కోట్లు ఉన్నట్లు చూపించింది. వెంటనే అన్నా రోడ్లో ఉన్న నా కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను సంప్రదించాను. వారు సరైన వివరణ ఇవ్వకుండా.. నా బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ వాళ్లు చేసిన తప్పుకు.. నా అనుమతి లేకుండా ఖాతా ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించినా.. సమాధానం చెప్పకుండా ఖాతా ఫ్రీజ్ అయ్యిందంటూ చెబుతున్నారు."
--మహ్మద్ ఇద్రీస్, నగదు పడిన వ్యక్తి
Cab Driver Get 9000 Crore : ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఉన్నట్టుండి అక్షరాల రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి. దీంతో ఎంతో సంతోషించిన అతడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కలకలం రేపిన ఈ సంఘటన తమిళనాడులోని కొడంబక్కం ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Haryana Farmer Got 200 Crore : రైతు బ్యాంక్ ఖాతాలో రూ.200 కోట్లు జమ!.. వారి అకౌంట్లలోకి లక్షలు!