ETV Bharat / bharat

కుమార్తెను రేప్ చేసి చంపిన తండ్రి- ప్రేమ వివాహం చేసుకుందని... - కుమార్తెపై తండ్రి అత్యాచారం

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఈనెల 4న జరిగిన ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కిరాతకుడు. తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశాడు.

man rapes daughter
కూతురిపై తండ్రి అత్యాచారం.
author img

By

Published : Nov 16, 2021, 7:39 PM IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై కర్కశంగా ప్రవర్తించాడు. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను కడతేర్చాడు. మధ్యప్రదేశ్​లోని భోపాల్​ జిల్లాలో ఈనెల 4న జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అంత్యక్రియలకు వెళ్తూ..

బాధితురాలు ఏడాది క్రితం ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని సీహోర్ జిల్లాలోని బిల్కిస్​గంజ్​​ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవల ఆమె సమస్​గఢ్​లోని అక్క ఇంటికి వచ్చింది. ఈనెల 4న బాధితురాలి కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో చిన్నారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాధితురాలి అక్క.. తండ్రిని పిలిచింది.

అంత్యక్రియల కోసమని మృతిచెందిన శిశువుతో బాధితురాలిని తన బండిపైన కొంతదూరం తీసుకెళ్లాడు తండ్రి. ఆ తర్వాత ఆమెను అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని కుమారుడికి చెప్పిన నిందితుడు.. తిరిగి గ్రామానికి చేరుకున్నాడు.

ఆదివారం ఓ ఫారెస్ట్ గార్డ్..​ బాధితురాలు, ఆమె పక్కనే ఆరునెలల శిశువు మృతదేహాలు గుర్తించడం వల్ల అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. తమ ఇష్టాలకు విరుద్ధంగా బాధితురాలు ప్రేమ పెళ్లి చేసుకోవడం పట్ల తన కుటుంబం కోపంగా ఉందని.. అందుకే ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు.

ఇదీ చూడండి : యువతి దారుణ హత్య.. జననాంగాన్ని కాల్చేసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.