మద్యం మత్తులో జరిగిన గొడవ వల్ల సొంత భార్యనే హత్యచేశాడు ఓ భర్త. భార్య మరణించిందని తెలియక రాత్రంతా శవం పక్కనే పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి భార్య మరణించిదని తెలిసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. సుల్తాన్పుర్కు చెందిన వినోద్ కుమార్ దూబే(47)ను నిందితుడిగా గుర్తించారు పోలీసులు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: వినోద్ కుమార్, సోనాలికి 2008లోనే వివాహం జరిగింది. గురువారం రాత్రి వీరిద్దరు కలిసి మద్యం సేవించారు. అనంతరం వినోద్ కుమార్.. సోనాలిని భోజనం వడ్డించమని అడగగా.. ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న సోనాలి.. వినోద్ కుమార్ చెంపపై కొట్టింది. ఆవేశంతో వినోద్.. సోనాలిని కొట్టాడు. అనంతరం దిండుతో ఊపిరాడకుండా చేశాడు. అప్పుడు అక్కడికక్కడే సోనాలి మృతి చెందింది. ఇది తెలియని నిందితుడు వినోద్.. రాత్రంతా ఆమె పక్కనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయం చూసేసరికి భార్య మరణించిందని తెలుసుకుని రూ.40,000 నగదుతో దిల్లీ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అంతలోనే పోలీసులు అరెస్టు చేశారు.
శుక్రవారం ఉదయం వినోద్ కుమార్ తన భార్యతో గొడవపడి తలగడతో ఊపిరాడకుండా చేశాడని పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్లో సమాచారం అందించాడు. నిందితుడు వినోద్ కుమార్ వద్ద నుంచి రూ. 43,280 నగదు, రెండు మద్యం సీసాలు, రక్తపు మరకలున్న దిండును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: గన్తో బెదిరించి రూ.50 లక్షలు చోరీ.. సీసీటీవీ వీడియో వైరల్