కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తాను పెంచుకున్న శునకాన్ని కరిచిందని.. వీధి కుక్కను కొట్టి చంపేశాడు చెందిన ఓ వ్యక్తి. ఈ బెంగుళూరు అర్బన్ జిల్లా ఆనేకల్ పట్టణంలోని హెబ్బగుడి రోడ్డులో జరిగిన ఘటనకు సంబంధించి అతనిపై కేసు నమోదైంది. దీంతో అతడు పరారయ్యాడు.
ఇదీ జరిగింది..
హెబ్బగుడి సమీపంలోని రోడ్డుపై ఓ వ్యక్తి పెంచుకుంటున్న శునకం, మరో వీధి కుక్క కలిశాయి. అయితే హఠాత్తుగా పెంపుడు శునకంపై వీధి కుక్క దాడి చేసింది. అతని ఇంటి వరకు వెంబడించి.. కరించింది. అప్పటికే మద్యం తాగి ఉన్న పెంపుడు కుక్క యజమాని.. ఈ సంఘటనను చూశాడు. కోపంతో ఊగిపోయి ఇనుప రాడ్డుతో వీధి కుక్కను కొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది. దానిని ఈడ్చుకెళ్లి సమీపంలోని రోడ్డు పక్కన పడేశాడు.
ఈ సంఘటన చూసిన యలహంక జంతు సంరక్షణ కేంద్రంలో పని చేస్తున్న అనిరుధ్.. ఆ యజమానిని ప్రశ్నించాడు. అందుకు అతను తాగిన మైకంలో దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనిరుధ్. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న నిందితుడు.. పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు చనిపోయిన కుక్కకు అంత్యక్రియలు నిర్వహించి.. జంతువుల పట్ల తన ఉదారతను చాటుకున్నాడు అనిరుధ్.
ఇదీ చూడండి: రోడ్ రోలర్‌ను కొట్టేసి.. కిలోల లెక్కన అమ్మేసి..