Man killed parents: బిహార్ ముజఫర్‌పుర్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. సొంత కుమారుడే తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. సోదరిని కూడా చంపేందుకు ప్రయత్నించగా.. ఆమె ఇంటి నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. పారూ పోలీస్ స్టేషన్ పరిధిలోని జఫర్ ఖుటాహీ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. నిందితుడు మొదట తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టి ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది.
Bihar crime news: స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం నిందితుడి పేరు అజయ్ సాహ్నీ. గురువారం ఇంట్లో తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే హత్యచేశాడు. సోదరి జ్యోతి మాత్రం తప్పించుకొని బయటకు వెళ్లి గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అజయ్‌ను ఇంట్లోనే దిగ్భందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని, గతంలోనూ పలువురిపై దాడి చేశాడని స్థానికులు చెప్పారు. కానీ తల్లిదండ్రులను చంపుతాడని అసలు ఊహించలేదన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బుడ్డోడు మామూలు అదృష్టజాతకుడు కాదు.. మూడో అంతస్తు నుంచి పడినా..