Serial killer: హరియాణా ఫరిదాబాద్‌లో 22 ఏళ్ల యువతి హత్య కేసులో 54 ఏళ్ల నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం విచారణలో అతడు చెప్పిన నిజాలు తెలిసి కంగుతిన్నారు. తాను గతంలోనూ మూడు హత్యలు చేశానని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించినందుకు ఆ ముగ్గురినీ చంపినట్లు చెప్పాడు. వారంతా మైనర్లే కావడం గమనార్హం.
'2019లో డిసెంబర్లో 15 ఏళ్ల బాలికను అత్యాచారం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడం వల్ల కోపంతో దారుణంగా హత్య చేశాడు. అలాగే 2020 ఆగస్టు, 2021 జూన్‌లోనూ ఇద్దరు మైనర్లను హతమార్చాడు. విచారణ ఇంకా కొనసాగుతోంది' అని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: దేశ రాజకీయాల్లో 'టెక్ ఫాగ్' కలకలం- భాజపాపై విపక్షాల నిప్పులు