ఉత్తర్‌ప్రదేశ్ జౌన్‌పుర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు.. అత్యాచార కేసులో ఓ దోషికి మరణశిక్ష విధించింది. 11 ఏళ్ల బాలికపై అఘాత్యానికి పాల్పడినట్లు తేల్చిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో పాటు రూ. 10,000 జరిమానా వేసింది.
గతేడాది ఆగస్టులో మడీయహు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన బాల్ గోవింద్.. 11 ఏళ్ల బాలికను అపహరించి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అప్పటి నుంచి కేసును పోలీసులు సమర్థంగా దర్యాప్తు చేశారని.. ఫలితంగా ఏడు నెలల్లోనే కోర్టు తీర్పు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం