ETV Bharat / bharat

అత్యాచార కేసులో దోషికి మరణశిక్ష - అత్యాచార కేసులో యూపీ వ్యక్తికి మరణశిక్ష

ఉత్తర్​ప్రదేశ్​లో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది పోక్సో ప్రత్యేక కోర్టు. ఘటన జరిగిన మూడున్నర నెలల్లోనే ఈ తీర్పు వెలువరించింది ధర్మాసనం. రాజస్థాన్​లో మరో అత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు విధించింది అక్కడి న్యాయస్థానం.

Man from Rajasthan gets life sentence for raping 2 minor sisters in 2019
అత్యాచార కేసులో దోషికి మరణశిక్ష.. 3నెలల్లో తీర్పు
author img

By

Published : Apr 1, 2021, 10:06 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది పోక్సో ప్రత్యేక న్యాయస్థానం. ఈ ఘటన 2020 డిసెంబరులో జరగగా.. మూడున్నర నెలల్లోనే తీర్పు వెలువరించింది.

అప్పుడేమైందంటే..?

ఫిరోజాబాద్​లోని జస్రానా పోలీసు స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నీరజ్.. 2020 డిసెంబర్​ 14న అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను అపహరించాడు. అనంతరం బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నిందితుడికి నేరాన్ని ధ్రువీకరించేలా అన్ని ఆధారాలు సేకరించారు.

రాజస్థాన్​లో మరో వ్యక్తికి జీవిత ఖైదు

రాజస్థాన్​లో ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది పోక్సో కోర్టు. రెండేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఎట్టకేలకు తీర్పు వెలువరించింది ధర్మాసనం.

అసలేం జరిగింది?

చిత్తోర్​గఢ్​కు చెందిన హిరాలాల్​ ఖతి.. దాబి జిల్లాలోని ఓ వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలోనే 2019లో బయట ఆడుకుంటున్న ఐదారేళ్ల వయసున్న ఆ ఇంటి యజమాని కుమార్తెలకు చాక్లెట్​ ఆశ చూపించి.. ఓ గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలికల తండ్రి.. ఆ ఏడాది జులై 4న ఖతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖతిని వెంటనే అరెస్ట్​ చేశారు. అప్పటి నుంచి నిందితుడు జైల్లో ఉన్నాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించిన రాజస్థాన్​లోని బుంది పోక్సో కోర్టు ఖతిని దోషిగా తేల్చింది. జీవిత ఖైదు విధించింది.

ఇదీ చూడండి: డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరకు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.