ఒడిశా సంబల్‌పూర్ జిల్లాలోని తల్పాలి గ్రామంలో భారీ కొండచిలువను గ్రామస్థులు తాడుతో కట్టేశారు. ఓ వ్యక్తి ఇంటి వెనుక కాలువ సమీపంలో తిరుగుతున్న కొండచిలువను స్థానికులు గమనించి పట్టుకున్నారు. అప్రమత్తమైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం తెలిపారు.
అయితే అధికారులు వచ్చే వరకు ప్రజల భద్రత కోసం కొండచిలువను తాడుతో కట్టేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పామును రక్షించి అడవిలో వదిలారు. ఈ క్రమంలో భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.
ఇవీ చదవండి: