ETV Bharat / bharat

మర్మాంగానికి పిన్నీసులు.. నగ్నంగా మృతదేహం.. అదే కారణమా? - మర్మాంగంల్లో సేఫ్టీ పిన్స్‌తో వ్యక్తి మృతి

మర్మాంగంలో సేఫ్టీ పిన్​​లతో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బంగాల్​లో ఈ ఘటన జరిగింది. పోలీసులు దీన్ని హత్యగా అనుమానిస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు.

Man died with safety pins in genitals in bengal
జననాంగాల్లో సేఫ్టీ పిన్స్‌తో వ్యక్తి మృతి
author img

By

Published : Apr 16, 2023, 12:03 PM IST

బంగాల్​లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మర్మాంగంలోకి సేఫ్టీ పిన్​లు చొప్పించి ఉన్నాయి. లైంగిక ఆనందం కోసం ఇలా అసహజ చర్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడి పేరు మలయ్ బసక్. అతడికి 40 ఏళ్లు ఉంటాయి. శాంతిపుర్ పోలీస్ స్టేషన్‌లోని ఫులియా మత్​పారా ప్రాంతానికి చెందిన మలయ్.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, పదేళ్ల కొడుకు ఉన్నారు. బుధవారం మలయ్ బసక్ భార్య.. శిప్రా, తన కొడుకును తీసుకుని పండగ కోసం పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం అనుకోకుండా.. మలయ్​ బసక్​ కొడుకు ఇంటికి వచ్చాడు. నగ్న స్థితిలో విగతజీవిగా తండ్రి పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే తల్లికి సమాచారం అందించాడు. అనంతరం అక్కడికి వచ్చిన మలయ్​ బసక్​ భార్య.. భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. చుట్టుపక్కల వాళ్లను, బంధువులను పిలిచింది. స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

"నా భర్తకు పోర్న్​ వీడియోలు చూసే అలవాటుంది. తరచూ వాటిని చూస్తుండేవాడు. ఆ విషయంలో మా ఇద్దరికీ చాలా సార్లు గొడవ కూడా జరిగింది. దీంతో నేను ఇంట్లో లేని సమయంలో పోర్న్​ వీడియోలు చూసేవాడు. నా భర్త మృతిపై నాకు అనుమానాలున్నాయి. ఎవరో నా భర్తను హత్య చేసి ఉంటారు. మాకు ఎవరితోనూ విభేదాలు లేవు." అని మృతుడి భార్య శిప్రా తెలిపింది. మృతుడి శవం కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. శరీరం నుంచి దుర్వాసన వస్తున్నట్లు వారు వెల్లడించారు. మలయ్ బసక్ హత్యకు గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు వారు వెల్లడించారు. విచారణ తరువాత అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి..
బంగాల్​లోని దుర్గాపుర్​లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. అమిత్​ అనే వ్యక్తి​ మృతదేహం సీలింగ్​ ఫ్యాన్​కు వేలాడుతూ ఉంది. అతని భార్య, ఇద్దరి పిల్లలు మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్​లో ఓ సూసైడ్​ నోట్ పోలీసులకు​ లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో​ ఓ మెసేజ్​​ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.