ETV Bharat / bharat

భరణం కోసం భార్య డిమాండ్​.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త! - బిహార్​ లేటెస్ట్​ న్యూస్​

అభిమాన హీరో సినిమా విజయం సాధించాలనో లేదా నచ్చిన నాయకుడు ఎన్నికల్లో గెలవాలనో కొందరు బ్యానర్​లో పట్టుకుని తిరిగడం మనం చూస్తుంటాం. కానీ హరియాణాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఓ వింత బ్యానర్​ పట్టుకుని తిరుగుతున్నాడు. రోడ్లపై వెళ్లే జనం అయితే.. ఆగి మరి దాన్ని చదువుతున్నారు. అసలు అందులో ఏం ఉందంటే..!

man forced to sell kidney
man forced to sell kidney
author img

By

Published : Mar 1, 2023, 10:07 AM IST

హరియాణాకు చెందిన ఓ వ్యక్తి అక్కడ నగర వీధుల్లో ఓ వింత బ్యానర్​ పట్టుకుని తిరుగుతున్నాడు. ఇంతకీ అందులో ఏం ఉందంటే.. "నా కిడ్నీ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మార్చి 21న ఆత్మాహుతి కార్యక్రమం" అని రాసి ఉంది. ఈ ఆత్మాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్‌లను కూడా ఆహ్వానించాడు ఆ వ్యక్తి. అసలు అతన ఎందుకు ఇలా బ్యానర్​ పట్టుకుని తిరుగుతున్నాడంటే..!

బిహార్​లోని పట్నాకు చెందిన సంజీవ్​ అనే వ్యక్తి.. హరియాణాలోని ఫరీదాబాద్​ వీధుల్లో వింత బ్యానర్​ పట్టుకుని తిరిగుతున్నాడు. సంజీవ్ ప్రస్తుతం ఓ ప్రింటింగ్ ప్రెస్​లో పనిచేస్తున్నాడు. సంజీవ్​కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి సంజీవ్​కు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. పెళ్లైన తర్వాత సంజీవ్​కు తన భార్య, బావమరిది, అత్తమామల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. కుటుంబంపై వరకట్నం కేసు పెడతామని బెదిరింపులకు గురి చేశారు. కాగా సంజీవ్​ భార్య 4 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా.. అక్కడివారు ఆమెకు అబార్షన్ చేయించారు. అప్పటినుంచి అతని భార్య కాపురానికి రావడానికి నిరాకరించగా.. సంజీవ్​పై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసింది. అయితే ప్రస్తుతం సంజీవ్​ బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు.

దాదాపు ఆరేళ్లుగా ఈ కేసు నడుస్తుండగా.. ఇప్పుడు భార్య తనకు విడాకులు ఇవ్వడమే కాకుండా.. భరణం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తోందని సంజీవ్ వాపోయాడు. సాయం చేయాల్సిందిగా పోలీసులు, అధికారులను ఎన్నిసార్లు సంప్రదించినా సరే తనకు న్యాయం జరగలేదని వెల్లడించాడు. దీంతో విసిగిపోయి ఇలా బ్యానర్‌తో తిరుగుతున్నానని వెల్లడించాడు. మార్చి 21లోగా కిడ్నీ విక్రయిస్తే ఆ డబ్బులు తన భార్యకు ఇస్తానని చెప్పాడు. ఒకవేళ విక్రయించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు.

man forced to sell kidney
బ్యానర్ పట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్న సంజీవ్​

ఈ మేరకు 21న పట్నాలో ఆమరణ నిరాహర దీక్ష, ఆత్మాహుతి కార్యక్రమం ఉంటుందని బ్యానర్​పై ముద్రించాడు సంజీవ్​. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌లు రావాలని వారి పేర్లను సైతం బ్యానర్‌పై ఒకవైపున ముద్రించాడు. రెండోవైపు.. భార్య, బావమరిది, ఇతర బంధువుల ఫొటోలను ముద్రించాడు. దీంతో పాటుగా సంజీవ్​ తన ఫోన్​ నంబర్​, ప్రస్తుతం ఉంటున్న చిరునామాను కూడా బ్యానర్​పై ప్రింట్​ చేశాడు. భార్య తన దగ్గరకు రావాలని తాను కోరుకుంటున్నా సరే.. రావడానికి ఆమె సిద్ధంగా లేదని సంజీవ్ తెలిపాడు. దీంతో రోడ్లపై వెళ్లే వారు తమ వాహనాలు ఆపి మరీ.. సంజీవ్​ బాధను తెలుసుకుంటున్నారు.

man forced to sell kidney
బ్యానర్​పై భార్య, బావమరిది, అత్త ఫొటోలను ముద్రించిన సంజీవ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.