ETV Bharat / bharat

భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే నిలువెత్తు విగ్రహం - statute for wife in karnataka

రోడ్డు ప్రమాదంలో మరణించిన తన భార్య జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు కర్ణాటకకు చెందిన శ్రీనివాస గుప్తా. భార్యపై ప్రేమతో నూతన గృహంలో నిలువెత్తు మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. తల్లి విగ్రహం చూసుకుని సజీవంగా ఉన్నట్లు కుమార్తెలు భావిస్తున్నారు.

statue for wife
నిలువెత్తు మైనపు విగ్రహం
author img

By

Published : May 14, 2021, 4:23 PM IST

భార్యమైనపు విగ్రహం

మనిషికే కాదు ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ప్రేమ ఎంతో అవసరం. అయితే మనుషులు తమ వారిపై ప్రేమను చూపటంలో ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. ఈ మాటల్ని నిజం చేస్తూ జీవితంలో నిజమైన ప్రేమ వల్ల ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు .. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ప్రాణంగా ప్రేమించిన తన భార్య ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లినా.. తన నూతన గృహంలో ఆమె విగ్రహం ఏర్పాటు చేసుకుని.. అర్ధాంగిపై అభిమానం ఘనంగా చాటుకున్నాడు.

కొప్పల్​ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త అయిన శ్రీనివాస గుప్తాకు భార్య అంటే ఎనలేని ప్రేమ. ఉన్నన్ని రోజులు మహారాణిలా చూసుకున్నాడు. 2017లో జరిగిన కారు ప్రమాదంలో భార్య మాధవి మరణించింది. ఆమె లేకున్నా.. ఇంట్లో ఆమె ఉనికి ప్రతిబింబించేలా డ్రాయింగ్ రూంలో మాధవి కూర్చున్నట్లు ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

తిరుపతికి వెళుతున్నప్పుడు నా భార్య మాధవి ప్రమాదంలో మరణించారు. ఆమె కోరిక, ఆలోచనలకు అనుగుణంగా నూతన గృహం నిర్మించాం. ఆమె మధుర స్మృతులకు గుర్తుగా ఈ విగ్రహం ఏర్పాటు చేశాం.

-- కె.శ్రీనివాస గుప్తా

జూలై 5, 2017న శ్రీనివాస గుప్తా .. కుటుంబంతో తిరుపతి వెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే కొప్పల్‌ పట్టణంలో ఇల్లు కొనాలనే కోరిక మాధవికి ఉండేది. ఆమె మరణం తరువాత గుప్తా మాధవి కలల గృహాన్ని నిర్మించాడు. ఆమె జ్ఞాపకార్థం భారీ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాడు.

"మా అమ్మ విగ్రహం సిలికాన్‌తో తయారు చేశారు. మాకు దూరమైన ఆమెను ఇలా చూసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మా తల్లి మాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది అధునాతన సాంకేతిక విగ్రహాలలో ఒకటి."

-- అనూష గుప్తా, మాధవి పెద్ద కుమార్తె

జీవకళ ఉట్టిపడుతూ అచ్చం మనిషిని పోలిన ఈ అపురూప విగ్రహం గురించి స్థానికులు అంతా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ మైనపు బొమ్మను బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ గొంబే మానే సంస్థ రూపొందించింది. ప్రఖ్యాత శిల్పి ఎం. శ్రీధర్ మూర్తి.. గోంబే మానేను 2017 నుంచి నిర్వహిస్తున్నారు. శ్రీధర్ పూర్వీకుల నుంచి ఈ కళను కొనసాగిస్తున్నారు. సిలికాన్ ఉపయోగించి మాధవి విగ్రహాన్ని అత్యంత సహజంగా మలిచారు. సహజమైన జుట్టుతోనే విగ్ తయారు చేసి 20 కిలోల ఈ విగ్రహానికి అమర్చారు.

"మాధవి విగ్రహం చూస్తున్నప్పుడు అమ్మ మన ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. సహజరీతిలో విగ్రహాన్ని పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. విగ్రహం ముందు నిలబడి ఆలోచనల్ని పంచుకోవడం ద్వారా వారి సమస్యకు పరిష్కారం చూపించగలిగినట్లు భావిస్తున్నాం."

-- శ్రీధర్‌ మూర్తి, శిల్పి

మాధవి గుప్తాకు ఇద్దరు కుమార్తెలు. ఆమె జీవించి ఉన్నప్పుడు వారు తల్లిని ఎంతగానో ప్రేమించారు. అమ్మ అకాల మరణం వారిని తీవ్రంగా కలిచి వేసింది. కానీ ఇప్పుడు తల్లి విగ్రహాన్ని చూసుకుని ఆమె తమతోనే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 92 ఏళ్ల వృద్ధ ఖైదీని గొలుసులతో కట్టి చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.