Man Builds Underground House With 11 Rooms : అందమైన ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఎన్ని వ్యయప్రయాసలకోర్చి అయినా సొంతిల్లు నిర్మించుకుంటారు. కానీ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పప్పు బాబా మాత్రం అత్యంత భిన్నంగా ఇల్లు కట్టుకున్నాడు. భూమి లోపల రెండు అంతస్తులతో ఇంటిని నిర్మించాడు. ఇందుకు అతడికి ఏకంగా పుష్కరకాలం పట్టింది. మరి అతనింటి విశేషాలను మనం కూడా చూద్దామా?
Underground House in Uttar Pradesh Hardoi : హర్దోయికి చెందిన ఇర్ఫాన్‌ను స్థానికంగా పప్పు బాబా అని పిలుచుకుంటారు. పప్పు బాబా నిర్మించిన ఇల్లు అందరి ఇళ్ల మాదిరిగా లేదు. రెండు అంతస్తులతో భూగర్భంలో ఇంటిని కట్టాడు. అందులో మసీదుతో పాటు 11 గదులు ఉన్నాయి. గ్యాలరీ, డ్రాయింగ్ రూమ్‌ను కూడా కట్టాడు. తన పొలంలోనే మట్టితో భూగర్భంలో రెండు అంతస్తులతో నిర్మించిన ఈ ఇంటి కోసం అతడు ఎంతో శ్రమించాడు. పైకి చూసేందుకు సాదాసీదాగా కనిపించే ఇంటిని లోపలికి వెళ్లే చూస్తే బంకర్ మాదిరిగా కనిపిస్తోంది.
తండ్రి మరణం.. ఎన్నికల్లో ఓటమి.. నిరాశతోనే..
Underground House in India UP : పప్పు బాబా 2011లో తన ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. ఖుర్పా సాయంతో పాత కాలంలో మాదిరిగా తన ఇంటి గోడలను చెక్కాడు. తన జీవితంలో అధిక సమయం ఇంటి నిర్మాణానికి కేటాయించాడు ఇర్ఫాన్. భోజనం చేసేందుకు మాత్రమే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేవాడు. 2010లో తండ్రి చనిపోవడం వల్ల అతడికి కష్టాలు మొదలయ్యాయి. దిల్లీలో పనిచేసే అతడు గ్రామానికి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
ఆ నిరాశలో కొన్నాళ్లు ఇంటికి దూరమయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు ఇంటిని కట్టాలనే ఆలోచనతో తిరిగి వచ్చాడు. పొలంలోనే ఇంటిని కట్టిన ఇర్ఫాన్ ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
పప్పు బాబా నిర్మించిన ఇంటిని చూసి స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు మెచ్చుకుంటున్నారు. తమ కళ్ల ముందే అతను ఎంతో కష్టపడి ఇల్లు కట్టాడని స్థానికులు చెబుతున్నారు.
కొండపై 80అడుగుల కుంట.. 90ఏళ్ల వృద్ధుడి భగీరథ ప్రయత్నం.. 50ఏళ్లు శ్రమించి..