ETV Bharat / bharat

ఆమెకు 53.. అతడికి 29.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. - వైద్యానికి వచ్చిన మహిళపై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తైవాన్​కు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. మరోవైపు, అరోగ్యం బాగాలేక క్లినిక్​కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నకిలీ వైద్యుడు. ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

rape
రేప్
author img

By

Published : Jul 26, 2022, 10:31 AM IST

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తైవాన్​కు చెందిన 53 ఏళ్ల మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హరియాణా గురుగ్రామ్​లోని సెక్టార్ 53 పోలీస్ స్టేషన్​లో పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితుడు విశ్వకర్మ(29)ను అరెస్టు చేశారు. సిటీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: 2017 నుంచి తైవాన్ మహిళ గురుగ్రామ్​లో ఉంటోంది. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. బాధితురాలికి ఆరు నెలల క్రితం నిందితుడు విశ్వకర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పెళ్లి చేసుకోమని అడగడం వల్ల ఆమె ఫోన్​ నంబర్​ను బ్లాక్​ చేశాడు. దీంతో బాధితురాలు సెక్టార్ 53 పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు విశ్వకర్శ మధ్యప్రదేశ్​కు చెందినవాడు. అతడు ప్రైవేట్ క్లినిక్​లో పనిచేస్తున్నాడు.

ఆరోగ్యం బాగాలేదని వెళ్తే: వైద్యం కోసం వెళ్లిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నకిలీ వైద్యుడు. ఈ ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​లో జరిగింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు గోపాల్​గఢ్​ పోలీసులు.. నిందితుడు మజ్రుద్దీన్(38)ను సోమవారం అరెస్టు చేశారు. అనారోగ్యంగా ఉందని బాధితురా​లు శనివారం క్లినిక్​కు వెళ్లగా.. నిందితుడు మజ్రుద్దీన్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఇవీ చదవండి: పోలీస్​స్టేషన్​లో అక్కాచెల్లెళ్ల వీరంగం.. మహిళా ఇన్​స్పెక్టర్​ను చెప్పుతో కొట్టి..

కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృతి.. పదిమందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.