ETV Bharat / bharat

అసహనానికి పర్యాయపదం మమత: నడ్డా

బంగాల్​ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మమత.. అసహనానికి పర్యాయపదం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.

author img

By

Published : Dec 9, 2020, 6:18 PM IST

Mamata synonymous with "intolerance": Nadda
అసహనానికి పర్యాయపదం మమతా: నడ్డా

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 'అసహనానికి పర్యాయపదం మమత' అని వ్యాఖ్యానించారు. బంగాల్​ సహా భాజపాయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో రాచరిక పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా సీట్లను సంపాదించి బంగాల్​లో భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు నడ్డా. రైతులు ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో భాజపా విజయభేరి మోగించిందన్నారు. మోదీ సర్కారు, ఆయన విధానాలకు అనుకూలంగా ఆ రాష్ట్ర రైతులు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

దేశవ్యాప్త యాత్రలో భాగంగా బంగాల్​లో పర్యటిస్తున్నారు నడ్డా. ఇందులో భాగంగా కోల్​కతా సహా తొమ్మిది జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు.

ఇదీ చూడండి: రైతు నిరసనలు ఉద్ధృతం- 14న దేశవ్యాప్త ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.