ETV Bharat / bharat

'మమతా బెనర్జీ కాలికి గాయం- దాడే కారణం!'

mamata
మమతా బెనర్జీ కాలికి గాయం
author img

By

Published : Mar 10, 2021, 6:52 PM IST

Updated : Mar 10, 2021, 7:32 PM IST

18:50 March 10

'మమతా బెనర్జీ కాలికి గాయం- దాడే కారణం!'

బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. నందిగ్రామ్​లో తన కారు వద్ద కొందరు వ్యక్తులు తోసేయడం వల్లే ఇలా జరిగినట్లు ఆమె ఆరోపించారు. నందిగ్రామ్​లోని రేయపారా ప్రాంతంలో ఓ ఆలయం బయట మమత ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.  

"నా కారు డోరు తెరిచి బయట నిలుచుని ఉన్నాను. ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తున్నా. కొందరు వ్యక్తులు నా కారును చుట్టుముట్టి, డోర్​ను తోసేశారు. కారు డోర్​ నా కాలుకు తగిలింది. కాలు వాచింది. గాయం కారణంగా జ్వరం వచ్చినట్లు అనిపిస్తోంది. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఈ సంఘటన జరిగినప్పుడు స్థానిక పోలీసులు ఎవరూ లేరని చెప్పారు మమత. కుట్రపూరితంగానే తనపై దాడి చేశారని ఆరోపించారు.  

గత రెండు రోజులుగా పుర్బా మెదినిపుర్​ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు మమత. ఈ రోజు ఉదయం నందిగ్రామ్​ స్థానానికి నామినేషన్​ దాఖలు చేశారు.

Last Updated : Mar 10, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.