బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోల్కతా ఎస్ఎస్కేఎం ఆస్పత్రి నుంచి తన ఇంటికి వెళ్లారు.
"మమత పదేపదే అడిగినందున... అవసరమైన సూచనలు చేసి ఆమెను డిశ్చార్జ్ చేశాం. 7 రోజుల తర్వాత మరోమారు పరీక్షలు చేయించుకోవాలని చెప్పాం" అని ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈనెల 10న నందిగ్రామ్ ప్రచారంలో ఆమె కాలికి గాయమైంది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మమత.